ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌ రాకెట్‌ సిటీ

ABN, First Publish Date - 2022-11-29T03:10:09+05:30

హైదరాబాద్‌ రాకెట్‌ సిటీ. ప్రైవేటు రంగంలో ఇటీవల ప్రయోగించిన విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ను పూర్తిగా హైదరాబాద్‌లో అభివృద్ధి చేశాం. రాకెట్‌ తయారీకి అవసరమైన విడి భాగాల సరఫరా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పదేళ్లలో అంతరిక్షంలోకి భారత పర్యాటకులు

  • స్పేస్‌ టెక్నాలజీలో భారత్‌ చాలా ముందుంది

  • ఎఫ్‌ఎల్‌ఓ కార్యక్రమంలో స్కైరూట్‌ సీఈఓ పవన్‌ చందన

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ రాకెట్‌ సిటీ. ప్రైవేటు రంగంలో ఇటీవల ప్రయోగించిన విక్రమ్‌-ఎస్‌ రాకెట్‌ను పూర్తిగా హైదరాబాద్‌లో అభివృద్ధి చేశాం. రాకెట్‌ తయారీకి అవసరమైన విడి భాగాల సరఫరా తయారీ ఎంతో కీలకం. అటువంటి సరఫరా వ్యవస్థ, కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయని స్కైరూట్‌ ఏరోస్పేస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్‌ చందన తెలిపారు. రాకెట్లను తయారు చేయడానికి హైదరాబాద్‌ ఉత్తమ నగరం. హైదరాబాద్‌ రాకెట్‌ సిటీ అని అన్నారు. ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ) భారత వ్యాపారాభివృద్ధిపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. కొన్ని దేశాలకు మాత్రమే సొంతంగా శాటిలైట్లు, రాకెట్లను తయారు చేయగల సామర్థ్యాలు ఉన్నాయి. స్పేస్‌ టెక్నాలజీలో భారత్‌ చాలా ముందు ఉందని, స్పేస్‌ టెక్నాలజీకి హైదరాబాద్‌ కేంద్రంగా మారుతోందని అన్నారు.

శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్‌.: వచ్చే పదేళ్లలో భారత పర్యాటకలు అంతరిక్షంలోకి వెళ్లే రోజులు రానున్నాయని.. ఇప్పటికే కొన్ని దేశాలు అంతరిక్షంలోకి పర్యాటకులను పంపుతున్నాయి. పదేళ్లలో భారత్‌లో కూడా ఇది సాకారమవుతుందని పవన్‌ అన్నారు. ఇప్పటి వరకూ రాకెట్లు గరిష్ఠంగా 10 మందిని మాత్రమే తీసుకువెళుతున్నాయి. విమానంలో ప్రయాణించగలిగినంత మంది ప్రయాణికులను అంతరిక్షంలోకి తీసుకువెళ్లడంపై పరిశోధనలు జరుగుతున్నాయి. విమాన టికెట్‌ ఖరీదుతోనే అంతరిక్షంలోకి వెళ్లే రోజులు వస్తాయన్నారు.

కాగా ఇప్పుడు ఎంత సాధారణంగా ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నామో.. అంతే సాధారణంగా వచ్చే ఐదేళ్లలో శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్‌ అందుబాటులో వస్తుందని చెప్పారు. స్పేస్‌ టెక్నాలజీలో తెలుగు రాష్ట్రాలు కీలకంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పాలసీ బజార్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ అలోక్‌ బన్సాల్‌, రాపిడో వ్యవస్థాపకుడు పవన్‌ గుంటుపల్లి ఎఫ్‌ఎల్‌ఓ, హైదరాబాద్‌ చైర్‌పర్సన్‌ శుబ్రా మహేశ్వరి, పాల్గొన్నారు.

Updated Date - 2022-11-29T03:10:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising