ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హానర్‌ హోమ్స్‌ ఐకానిక్‌ ప్రాజెక్ట్‌ ‘రిచ్‌మాంట్‌’

ABN, First Publish Date - 2022-08-09T05:49:38+05:30

గృహ నిర్మాణ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హానర్‌ హోమ్స్‌ హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌ వద్ద ‘రిచ్‌మాంట్‌’ పేరుతో ఐకానిక్‌ మ్యాన్షన్ల నిర్మాణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

142 మ్యాన్షన్ల నిర్మాణం

ప్రచారకర్తగా అల్లు అర్జున్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గృహ నిర్మాణ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హానర్‌ హోమ్స్‌ హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌ వద్ద ‘రిచ్‌మాంట్‌’ పేరుతో ఐకానిక్‌ మ్యాన్షన్ల నిర్మాణం చేపట్టింది. హానర్‌ హోమ్స్‌కు ఇది మూడో ప్రాజెక్టు. దాదాపు 28.4 ఎకరాల్లో విస్తరించి ఉండే ఈ ప్రాజెక్టులో మొత్తం 142 డిజైన్డ్‌, కస్టమైజ్డ్‌ బొటిక్‌ మ్యాన్షన్లను నిర్మిస్తున్నట్లు హానర్‌ హోమ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై.స్వప్న కుమార్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టు మూడున్నరేళ్లలో పూర్తవుతుంది. స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ను హానర్‌ హోమ్స్‌ ప్రచారకర్తగా ఎంచుకుంది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే పూర్తి చేసిన ‘హానర్‌ వివాంటిస్‌’లో 760 గృహాలు ఉన్నాయని, 1216 గృహాలతో రూపొందిస్తున్న హానర్‌ అక్వాంటిస్‌  2023, మార్చి నాటికి పూర్తి కానుందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, ప్రమోటర్‌ ఎం బాలు చౌదరి తెలిపారు. మొదటి ప్రాజెక్టును 12 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేసినట్లు వివరించారు. 20 లక్షల చ.అ అభివృద్ధి ప్రక్రియలో ఉంది. ‘‘నాలుగో ప్రాజెక్టును అభివృద్ధి చేసే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టాం. 85 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి అనుమతి లభించింది’’ అని బాలు చౌదరి చెప్పారు. 


2.5 ఎకరాల్లో సెంట్రల్‌ పార్క్‌..

అత్యున్నత స్థాయి వర్గాలు కలలుకనే గృహాలను సాకారం చేసే దశగా ‘రిచ్‌మాంట్‌’ ప్రాజెక్ట్‌ ఐకానిక్‌ మ్యాన్షన్ల శైలి, సౌకర్యాలను తీర్చిదిద్దాం. ప్రతి మ్యాన్షన్‌ను 6,787-10,287 చదరపు అడుగుల్లో నిర్మిస్తాం. ప్రతి మ్యాన్షన్‌లోనూ విస్తృత మినీ థియేటర్‌ వంటి సౌకర్యాలు ఉంటాయని స్వప్న కుమార్‌ వివరించారు. 2.5 ఎకరాల్లో సెంట్రల్‌ పార్క్‌, పెద్ద, పెద్ద సెలబ్రేషన్లను నిర్వహించుకునేందుకు పెద్ద హాలు వంటి అనేక అత్యాధునిక సదుపాయాలు ఉంటాయన్నారు. 

Updated Date - 2022-08-09T05:49:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising