ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంటాడిన ఆర్‌బీఐ పాలసీ భయాలు

ABN, First Publish Date - 2022-09-28T06:26:40+05:30

ఈక్విటీ మార్కెట్‌ నుంచి భారీగా తరలిపోతున్న విదేశీ పెట్టుబడులపై ఆందోళనలతో పాటుగా శుక్రవారం వెలువడనున్న ఆర్‌బీఐ పాలసీకి ముందు నెలకొన్న అప్రమత్తత మంగళవారం స్టాక్‌ మార్క్లెను నష్టాల బాటలో నడిపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెన్సెక్స్‌ 38 పాయింట్లు డౌన్‌ 

ముంబై: ఈక్విటీ మార్కెట్‌ నుంచి భారీగా తరలిపోతున్న విదేశీ పెట్టుబడులపై ఆందోళనలతో పాటుగా శుక్రవారం వెలువడనున్న ఆర్‌బీఐ పాలసీకి ముందు నెలకొన్న అప్రమత్తత మంగళవారం స్టాక్‌ మార్క్లెను నష్టాల బాటలో నడిపించింది. నాలుగు రోజుల భారీ పతనం కారణంగా ఈక్విటీ సూచీలు పాజిటివ్‌గానే ప్రారంభమైనా మెటల్‌, బ్యాంకింగ్‌ షేర్లలో లాభాల స్వీకారం నష్టాలకు కారణమైంది. అయితే ఎంపిక చేసిన ఫార్మా, ఐటీ షేర్ల కొనుగోళ్లు సూచీలను ఆదుకున్నాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 560 పాయింట్ల మేరకు లాభపడినప్పటికీ చివరికి 37.70 పాయింట్ల నష్టంతో 57107.52 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 16,950 కన్నా దిగజారినా కోలుకుని చివరికి 8.90 పాయింట్ల నష్టంతో 17,007.40 వద్ద క్లోజైంది. ఎఫ్‌పీఐలు సోమవారం రూ.5101.30 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు.

  

14 పైసలు లాభపడిన రూపాయి: పరిమిత పరిధిలోనే కన్సాలిడేట్‌ అయిన రూపాయి చివరికి 14 పైసల లాభంతో 81.53 వద్ద ముగిసింది. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ఆరంభంలో 81.45 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 81.30-81.64 మధ్యన కదలాడింది. సమీప భవిష్యత్తులో రూపాయి 81.20-81.80 మధ్యన కదలాడవచ్చని ఫారెక్స్‌ నిపుణుల అంచనా. 

Updated Date - 2022-09-28T06:26:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising