ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీఎస్‌టీ వసూళ్ళు 18 శాతం పెరిగాయ్... రూ. 1.33 లక్షల కోట్లకు చేరిక...

ABN, First Publish Date - 2022-03-01T20:58:56+05:30

జీఎస్‌టీ వసూళ్ళు ఈ ఏడాది జనవరి నెలలో రికార్డ్ స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. కాగా... ఫిబ్రవరిలో కూడా దాదాపుగా అదే స్థాయిలో వసూళ్ళు జరిగాయి. దేశమంతటా నెలకొన్న ఓమిక్రాన్ నేపథ్యంలో... జనవరిలో రికార్డు స్థాయిలో రూ. 1,40,986 కోట్ల మేరకు జీఎస్‌టీ వసూలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : జీఎస్‌టీ వసూళ్ళు ఈ ఏడాది జనవరి నెలలో రికార్డ్ స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. కాగా... ఫిబ్రవరిలో కూడా దాదాపుగా అదే స్థాయిలో వసూళ్ళు జరిగాయి. దేశమంతటా నెలకొన్న  ఓమిక్రాన్  నేపథ్యంలో... జనవరిలో రికార్డు స్థాయిలో రూ. 1,40,986 కోట్ల మేరకు జీఎస్‌టీ వసూలైంది. ప్రస్తుత(ఫిబ్రవరి 2022) నెలలో ఆదాయాలు గతేడాది ఇదే నెలలో వచ్చిన జీఎస్‌టీ ఆదాయాల కంటే 18 శాతం ఎక్కువ. అంతేకాకుండా... ఫిబ్రవరి 2020లో జీఎస్‌టీ  రాబడి కంటే 26 శాతం ఎక్కువ. ఫిబ్రవరిలో జీఎస్‌టీ  వసూళ్లు రూ. 1.33 లక్షల కోట్లకు పైగా నమోదయ్యాయని, గతేడాదితో పోలిస్తే ఇది 18 శాతం వృద్ధిని సాధించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది.


‘ఫిబ్రవరి 2022 లో సేకరించిన స్థూల జీఎస్‌టీ ఆదాయం రూ. 1,33,026 కోట్లు. ఇందులో సెంట్రల్ జీఎస్‌టీ రూ. 24,435 కోట్లు కాగా, రాష్ట్ర జీఎస్‌టీ రూ. 30,779 కోట్లు. ఇక సమీక‌ృత జీఎస్‌టీ రూ. 67,471 కోట్ల(రూ. 33,837 కోట్లు సహా) వసూళ్లు. ఇంకా... వస్తువుల దిగుమతిపై రూ. 10,340 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ. 638 కోట్లు సహా)’ అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫిబ్రవరి 2022 కు వచ్చే ఆదాయాలు గతేడాది ఇదే నెలలో వచ్చినజీఎస్‌టీ ఆదాయాల కంటే 18 శాతం ఎక్కువ, 2020 ఫిబ్రవరిలో వచ్చిన జీఎస్‌టీ రాబడి కంటే 26 శాతం అధికం. కాగా... ఫిబ్రవరి... కేవలం 28 రోజుల నెల మాత్రమే కావడంతో... సాధారణంగా జనవరి కంటే తక్కువ ఆదాయం వస్తుందని మంత్రిత్వ శాఖ వివరించింది. ఫిబ్రవరి 2022 లో ఈ వృద్ధిని పాక్షిక లాక్‌డౌన్‌లు, వారాంతపు/రాత్రి కర్ఫ్యూలు/జనవరి 20 న గరిష్ట స్థాయికి చేరుకున్న ఓమిక్రాన్ వేవ్ నేపథ్యంలో... పలు రాష్ట్రాలు విధించిన వివిధ ఆంక్షల నేపథ్యంలో కూడా ఈ పరిస్థితి చోటుచేసుకుని ఉండవచ్చునని చెబుతున్నారు. 

Updated Date - 2022-03-01T20:58:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising