ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇ-వెహికల్ అగ్నిప్రమాదంపై... ప్రభుత్వ విచారణ * సొంతంగా కూడా విచారణ చేపట్టిన టాటా మోటార్స్

ABN, First Publish Date - 2022-06-23T21:12:39+05:30

టాటా మోటార్స్ ఇటీవల Nexon EV మ్యాక్స్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో, అధిక పవర్, టార్క్‌, ఒక ఛార్జ్‌పై 437 కిలోమీటర్ల మైలేజీని కంపెనీ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : టాటా మోటార్స్ ఇటీవల Nexon EV మ్యాక్స్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో, అధిక పవర్, టార్క్‌, ఒక ఛార్జ్‌పై 437 కిలోమీటర్ల మైలేజీని కంపెనీ ప్రకటించింది. కాగా... బుధవారం ముంబై శివారులో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ మంటల్లో చిక్కుకోవడం వెనుక గల కారణాలపై విచారణకు ఆదేశించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ(MoRTH) ఈ ఘటనపై దర్యాప్తునకు... ఆదేశించింది. Ola Electric, Okinawa Autotech, Pure EV, Jitendra Electric Vehicles, Boom Motors ప్రతినిధులతో MoRTH అధికారులు సంబంధిత కంపెనీలతో చర్చిస్తున్నారు.


మరోవైపు... టాటా మోటార్స్ కూడా ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది. ‘సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఇటీవలి సంఘటన సంబంధిత వాస్తవాలను నిర్ధారించే క్రమంలో... ప్రస్తుతం వివరణాత్మక దర్యాప్తు జరుగుతోంది. పూర్తి విచారణ తర్వాత వివరణాత్మక ప్రతిస్పందనను వెల్లడిస్తాం’ అని పేర్కొన్న కంపెనీ ‘దాదాపు నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 30 వేలకు పైబడి విద్యుత్తు వాహనాలు, 100 మిలియన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణించిన తర్వాత మొదటిసారి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2022-06-23T21:12:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising