ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏబీజీ షిప్‌యార్డ్ కేసు... దర్యాప్తు స్పీడ్ పెంచండి... ఎస్‌ఎఫ్‌ఐఓకు ప్రభుత్వాదేశాలు

ABN, First Publish Date - 2022-03-16T21:49:34+05:30

ఏబీజీ షిప్‌యార్డ్ కేసుకు సంబంధించి... దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐఓను ప్రభుత్వం ఆదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఏబీజీ షిప్‌యార్డ్ కేసుకు సంబంధించి... దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐఓను ప్రభుత్వం ఆదేశించింది. సీబీఐ అంతకుముందు... కంపెనీ, దాని మాజీ ఛైర్మన్ అండ్  మేనేజింగ్ డైరెక్టర్ రిషి కమలేష్ అగర్వాల్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మూడేళ్ళ క్రితం(అంటే... 2019 లో)... ఐఎల్అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌పై ఎస్‌ఎఫ్‌ఐఓ చేసిన విచారణ నివేదికలో... ఏబీజీ గ్రూపునకు చెందిన పదమూడు రుణ ఖాతాలను లిస్టింగ్ చేసిన విషయం తెలిసిందే. దివాలా ప్రకటించిన ఏబీజీ షిప్‌యార్డ్ కేసులో నిధులను స్వాహా చేశారన్న ఆరోపణలపై విచారణను వేగవంతం చేయాలని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌ను కేంద్రం కోరింది.


 మూడేళ్ళ(2019) నుండి ఏబీజీ షిప్‌యార్డ్ రికార్డులపై ఎస్‌ఎఫ్‌ఐఓ విచారణ జరుపుతున్న నేపథ్యంలో... ఆ విచారణను వేగవంతం చేయాలని ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. సంబంధిత నివేదికను త్వరగా అందించాలని కూడా కోరినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు... సీబీఐ... కంపెనీ, దాని మాజీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రిషి కమలేష్ అగర్వాల్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మొత్తం రూ. 22,848 కోట్ల మోసానికి పాల్పడిన నిందితునిగా ఆయనను ఎఫ్ఐఆర్ పేర్కొంది. "కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎస్‌ఎఫ్‌ఐఓతో... పెద్ద మోసాల్ె పంబంధించిన కేసులను మరో 10-15 రోజుల్లో సమీక్షించనుంది. ఏబీజీ షిప్‌యార్డ్ విషయమే నివేదికను త్వరలోనే అందనున్నట్లు భావిస్తున్నామని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 


కాగా... 2019 నవంబరులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... కంపెనీకి సంబంధించిన ఫోరెన్సిక్ ఆడిట్‌ను  నివేదించిన సందర్భంలో... ఈ ఆడిట్ ఆధారంగా... ఎస్‌బీఐ నవంబరు  2019 లో సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో... సీబీఐ  ఆరోపించిన స్కామ్‌తో ఎవరైనా బ్యాంక్ ఉద్యోగులకు ప్రమేయముందా ? అన్న విషయమై ‘అంతర్గత విచారణ’ కూడా నిర్వహించాలని బ్యాంకును కోరింది.  కాగా... 2019 లో... ఐఎల్‌అండ్‌‌ఎఫ్‌ఎస్‌పై చేసిన విచారణ నివేదికలో... పదమూడు రుణఖాతాలను ఏబీజీ లిస్ట్ చేసింది, ఇందులో డ్యూ ప్రాసెస్‌ను  అనుసరించకుండా ఇచ్చిన వ్యక్తిగత రుణాలు కూడా ఉన్నాయని సమాచారం. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా గత నెలలో ఏబీజీ షిప్‌యార్డ్, దాని ప్రమోటర్లపై మనీలాండరింగ్ కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-03-16T21:49:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising