ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

personal loan apps: 2 వేల పర్సనల్ లోన్ యాప్‌లపై గూగుల్ వేటు

ABN, First Publish Date - 2022-08-26T02:43:34+05:30

చిటికెలో రుణాలు ఇస్తామంటూ గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రత్యక్షమయ్యే రుణయాప్‌ల బారినపడిన ఎందరో విలవిల్లాడిపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చిటికెలో రుణాలు ఇస్తామంటూ గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రత్యక్షమయ్యే రుణయాప్‌ల బారినపడిన ఎందరో విలవిల్లాడిపోయారు. రుణాలను సకాలంలో తిరిగి చెల్లించకపోతే అవి పెట్టే నరకయాతన భరించలేక పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు కూడా వెలుగుచూశాయి. దీంతో ఈ యాప్‌లపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఇలాంటి రుణయాప్‌లపై గూగుల్ కూడా వేటేసింది. ఈ ఏడాది మొత్తంగా 2 వేలకుపైగా పర్సనల్ లోన్ యాప్స్‌ను భారత్‌లోని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. 


ఇండియన్ యూజర్లను ఈ యాప్స్ టార్గెట్ చేస్తున్నాయని గుర్తించిన గూగుల్.. స్థానిక చట్ట సంస్థలను సంప్రదించిన తర్వాత వీటిని తొలగించినట్టు గూగుల్ ఆసియా పసిఫిక్ సీనియర్ డైరెక్టర్, హెడ్ ఆఫ్ ట్రస్ట్ సాయికత్ మిత్రా తెలిపారు. ఇలాంటి యాప్స్ నుంచి రక్షణ కోసం పాలసీ విధానంలో మార్పులు తీసుకొస్తున్నట్టు చెప్పారు. 


ప్రజలను దోపిడీ చేస్తున్న రుణ యాప్‌లపై వేటు వేసేందుకు గూగుల్‌తోపాటు ఇతర సంస్థలు కూడా పోటీపడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అవి వినియోగదారుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం, హద్దులు దాటి మితిమీరి ప్రవర్తించడం వంటివి చేస్తున్నాయి. కొన్ని సంస్థలు చైనా కంపెనీలకు డబ్బును లాండరింగ్ చేయడానికి ఈ వ్యాపారాన్ని ఉపయోగించుకుంటున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గూగుల్ ఈ చర్యలు తీసుకుంది.


గతేడాది కూడా గూగుల్ తన యాప్ స్టోర్ నుంచి వందలాది యాప్స్‌ను తొలగించింది. రుణాలను తిరిగి చెల్లించేందుకు ఈ యాప్స్ కనీసం 60 రోజులు గడువు ఇవ్వాలి. అయితే, అలాంటి గడువు ఏదీ లేకుండా ఒక్క రోజు లేటైనా వేధించడం మొదలుపెట్టాయి. ఇలాంటి కేసులో ప్రతి రోజూ వెలుగు చూస్తుండడంతో భారతీయ రిజర్వు బ్యాంకు కూడా ఇటువంటి రుణ సంస్థలపై ఉక్కుపాదం మోపింది. రుణ యాప్‌లు ఖాతాదారుల  డేటాను యాక్సెస్ చేయకుండా నిరోధించేలా మార్గదర్శకాలు రూపొందించి విడుదల చేసింది. అలాగే, అవి విధించే వడ్డీని బహిర్గతం చేయాల్సిందేనని ఆదేశించింది.

Updated Date - 2022-08-26T02:43:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising