ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిండా మునిగిన గ్లాండ్ ఫార్మా స్టాక్.. 52 వారాల కనిష్టానికి షేర్లు..

ABN, First Publish Date - 2022-07-21T19:49:11+05:30

గ్లాండ్ ఫార్మా(Gland Pharma) షేర్లు నేడు పాతాళానికి చేరాయి. ఏకంగా 52 వారాల కనిష్టానికి చేరుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్లాండ్ ఫార్మా(Gland Pharma) షేర్లు నేడు పాతాళానికి చేరాయి. ఏకంగా 52 వారాల కనిష్టానికి చేరుకున్నాయి. జూన్ త్రైమాసికంగా దారుణమైన ఫలితాలను వెల్లడించడంతో కంపెనీ షేర్లు నిలువునా కూలిపోయాయి. గురువారం ఇంట్రా-డేలో బీఎస్‌ఈ(BSE)లో గ్లాండ్ ఫార్మా షేర్లు 10 శాతం క్షీణించడంతో 52 వారాల కనిష్ట స్థాయి రూ.2,232కి చేరుకుంది. తక్కువ కార్యాచరణ ఆదాయం కారణంగా 2023 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో పన్ను తర్వాత లాభం(PAT) వార్షికంగా 35 శాతం క్షీణించి రూ.229 కోట్లకు చేరింది. 


గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఫార్మాస్యూటికల్(Pharmacuetical) కంపెనీ PAT రూ.351 కోట్లుగా ఉంది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన 2022 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.286 కోట్ల నుంచి PAT 20 శాతం తగ్గింది. గత ఏడాది జూలై 14న తాకిన దాని మునుపటి కనిష్ట స్థాయి రూ.2,421.30 కంటే దిగువకు పడిపోయింది. గత మూడు నెలల్లో ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్‌లో 3 శాతంతో క్షీణించింది. ఇది నవంబర్ 20, 2020న రికార్డు స్థాయిలో రూ.1,701కి చేరుకుంది. గత మూడు నెలల కరెక్షన్‌తో, ఆగస్ట్ 12, 2021న తాకిన దాని ఆల్-టైమ్ హై లెవెల్ రూ.4,350 నుంచి స్టాక్ దాదాపు సగానికి పడిపోయింది


కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం రూ. 1,154 కోట్ల నుంచి 26 శాతం క్షీణించి రూ.857 కోట్లకు చేరింది. కోవిడ్-19 సంబంధిత ఉత్పత్తుల విక్రయాల కారణంగా గత సంవత్సరం ఆదాయం ఎక్కువగా ఉంది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇన్సులిన్ లైన్‌ని ప్రణాళికాబద్ధంగా మూసివేయడంతో పాటు రెమ్‌డెసివిర్, ఎనోక్సాపరిన్ ఇంజెక్షన్ వంటి కోవిడ్-19 ఔషధాల అధిక విక్రయాల కారణంగా భారతదేశ అమ్మకాలు ప్రభావితమయ్యాయని గ్లాండ్ ఫార్మా తెలిపింది.


Updated Date - 2022-07-21T19:49:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising