ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

adani: అదానీ సంపద మరింత క్షీణత.. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ఇప్పుడు ఏ స్థానమో తెలుసా..

ABN, First Publish Date - 2022-09-29T23:19:15+05:30

అదానీ గ్రూప్ (adani group) కంపెనీ అధినేత గౌతమ్ అదానీ (gautham adani) ప్రపంచ సంపన్నుల జాబితాలో ఎంతవేగంతో రెండవ స్థానానికి దూసుకెళ్లారో అంతేవేగంతో ర్యాంకులు దిగజారుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : అదానీ గ్రూప్ (adani group) కంపెనీల అధినేత గౌతమ్ అదానీ (gautham adani) ప్రపంచ సంపన్నుల జాబితాలో ఎంతవేగంతో రెండవ స్థానానికి దూసుకెళ్లారో అంతేవేగంతో ర్యాంకులు దిగజారుతున్నారు. తాజాగా ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా (Forbes Rich list) లో గౌతమ్ అదానీ నాలుగవ స్థానానికి పడిపోయారు. లూయిస్ విట్టొన్ కంపెనీ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్డ్ 3వ స్థానానికి ఎగబాకారు. తొలి రెండు స్థానాల్లో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon musk), అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ (Jeff Bezons) కొనసాగుతున్నారు. సాంకేతికంగా గౌతమ్ అదానీ 4వ స్థానానికి పడిపోయినా.. 2వ స్థానం కోసం బెజోస్, ఆర్నాల్ట్, గౌతమ్ అదానీ ముగ్గురి మధ్య పోటీ కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్ల హెచ్చుతగ్గులను బట్టి వీరి స్థానాల్లో మార్పులు చేసుకుంటున్నాయి.


కాగా బిలియనీర్స్ జాబితాలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ సంపద విలువ 141.2 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే భారతీయ కరెన్సీలో రూ.11.54 లక్షల కోట్లుగా ఉంది. ఇక రెండవ స్థానానికి దూసుకెళ్లిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఆస్తి విలువ 141.4 బిలియన్ డాలర్లు (రూ.11.56 లక్షల కోట్లు)గా ఉంది. దీనిని బట్టి  వీరిద్దరి సంపద మధ్య వ్యత్యాసం చాలా స్వల్పంగా ఉంది. ఇక ఆసియాలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ సంపద విలువ మార్కెట్ల ఒడిదొడుకుల కారణంగా 5.7 బిలియన్ డాలర్ల మేర పతనమై 134.2 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంటే భారతీయ కరెన్సీలో రూ.10.97 లక్షల కోట్లుగా ఉంది. ఇక అగ్రస్థానంలో కొనసాగుతున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆస్తి విలువ 263.2 బిలియన్ డాలర్లు (రూ.21.52 లక్షల కోట్లు)గా ఉంది.


అదానీ ఆస్తి కరిగిపోవడానికి కారణం ఇదే..

దేశీయ ఈక్విటీ మార్కెట్లు ప్రస్తుతం తీవ్ర ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఇందుకు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లేమీ మినహాయింపు కాదు. పలు కంపెనీల స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ కారణంగానే గౌతమ్ అదానీ సంపద విలువ గణనీయంగా పడిపోయింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచనుందనే అంచనాలు మార్కెట్ల నష్టాలకు కారణమవుతున్నాయి.

Updated Date - 2022-09-29T23:19:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising