ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారెన్ బఫెట్‌ను దాటేసిన అదానీ.. ప్రపంచ కుబేరుల్లో 5వ స్థానం

ABN, First Publish Date - 2022-04-26T00:27:30+05:30

న్యూఢిల్లీ: అదానీ గ్రూపుల అధినేత గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మరింత ముందుకు దూసుకెళ్లారు. దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌ను అధిగమించి ప్రపంచ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అదానీ గ్రూపుల అధినేత గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మరింత ముందుకు దూసుకెళ్లారు. దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌ను అధిగమించి ప్రపంచ సంపన్నుల జాబితాలో 5వ స్థానానికి ఎగబాకారు. ఈ మేరకు ఫోర్బ్స్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా విడుదలైంది. ఫోర్బ్స్ డేటా ప్రకారం.. 91 ఏళ్ల వారెన్ బఫెట్ సంపద విలువ 121.7 బిలియన్ డాలర్లు కాగా.. అదానీ ఆస్తుల విలువ 123.7 బిలియన్ డాలర్లుగా ఉంది. వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్‌వే షేర్లు శుక్రవారం 2 శాతం మేర పతనమవ్వడంతో ఆయన సంపద విలువ తగ్గింది. అమెరికా మార్కెట్లు గత శుక్రవారం నష్టాలను చవిచూశాయి. ఈ క్రమంలోనే బెర్క్‌షైర్ షేర్లు కూడా నష్టాల్లో ముగిశాయి. కాగా అత్యంత భారతీయ సంపన్నుడిగా కొనసాగుతున్న గౌతమ్ అదానీ.. దేశంలో 2వ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్  అంబానీ కంటే 19 బిలియన్ డాలర్లు ఎక్కువ సంపదను కలిగివున్నారు. ముకేష్ అంబానీ సంపద విలువ 104.7 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ రిపోర్ట్ పేర్కొంది. 


అదానీ కంటే నలుగురే ముందున్నారు

ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ ట్రాకర్ ప్రకారం... ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ కంటే కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే ముందున్నారు. టెస్లా, స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ 269.7 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(170.2 బిలియన్ డాలర్లు), ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్‌ కింగ్ అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్(167.9 బిలియన్ డాలర్లు), మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్(130.2 బిలియన్ డాలర్లు) వరుస స్థానాల్లో ఉన్నారు.

Updated Date - 2022-04-26T00:27:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising