ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Edible Oil Prices: హమ్మయ్య.. Fortune వంటనూనె ధరలు తగ్గాయి.. లీటర్‌పై ఎంత తగ్గిందంటే..

ABN, First Publish Date - 2022-07-18T22:40:44+05:30

Fortune బ్రాండ్ పేరుతో వంట నూనెల కంపెనీ ఆదానీ విల్మార్ విక్రయిస్తున్న వంట నూనె ధరను తగ్గిస్తూ సదరు కంపెనీ సోమవారం నిర్ణయం తీసుకుంది. ఫార్చ్యూన్ బ్రాండ్ వంట నూనె లీటర్ ధరపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Fortune బ్రాండ్ పేరుతో వంట నూనెల కంపెనీ ఆదానీ విల్మార్ విక్రయిస్తున్న వంట నూనె ధరను తగ్గిస్తూ సదరు కంపెనీ సోమవారం నిర్ణయం తీసుకుంది. ఫార్చ్యూన్ బ్రాండ్ వంట నూనె లీటర్ ధరపై 30 రూపాయలను తగ్గిస్తున్నట్లు ఆదానీ విల్మార్ సంస్థ ప్రకటించింది. ఫార్చ్యూన్ సోయాబీన్ ఆయిల్ (Fortune Soyabean Oil) ధరను గరిష్టంగా తగ్గిస్తూ ఈ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపు ధరలకు సంబంధించిన స్టాక్స్ త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే Dhara బ్రాండ్ పేరుతో వంట నూనెను విక్రయించే Mothers Dairy సోయాబీన్, రైస్ బ్రాన్ ఆయిల్‌ లీటర్‌ ధరపై 14 రూపాయలు తగ్గిస్తూ గత ఫిబ్రవరి 7న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జులై 6న Food Ministry ఆధ్వర్యంలో ఆయిల్ ధరల తగ్గింపుపై కీలక సమావేశం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో భారత్‌లోని వినియోగదారులకు కూడా ఆ తగ్గింపు ఫలాలు అందేలా చూడాలని కేంద్రం వంట నూనెల తయారీ కంపెనీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆదానీ విల్మార్ ఈ నిర్ణయం తీసుకుంది.



ఫార్చ్యూన్ సోయాబీన్ ఆయిల్ (Fortune Soyabean Oil) లీటర్ ధర 195 రూపాయల నుంచి 165కి తగ్గింది. ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ (Fortune Sunflower Oil) లీటర్ ఇప్పటివరకూ 210 రూపాయలు అమ్ముతుండగా ఇకపై 199 రూపాయలకే విక్రయించనున్నారు. ఫార్చ్యూన్ రైస్ బాన్ ఆయిల్ (Fortune Rice Bran Oil) లీటర్ ధర 225 రూపాయల నుంచి 210 రూపాయలకు తగ్గింది. పల్లీల నూనె లీటర్ 220 రూపాయలు ఉండగా తాజా తగ్గింపుతో రూ.210 తగ్గింది. రాగ్ వనస్పతి నూనె లీటర్ ఇప్పటివరకూ 200 రూపాయలు ఉండగా ఇకపై 185 రూపాయలకే లభించనుంది. రాగ్ పామోలిన్ ఆయిల్ 170 రూపాయలు ఉండగా 144 రూపాయలకే ఇకపై లభించనుండటం గమనార్హం. త్వరలోనే ఈ తగ్గించిన ధరలతో మార్కెట్లో తమ బ్రాండ్ వంట నూనెలను విక్రయిస్తామని ఆదానీ విల్మార్ ఎండీ అండ్ సీఈవో అంగ్షు మల్లిక్ తెలిపారు. తమ ఆయిల్ తక్కువ ధరలకే లభించే అవకాశం ఉండటంతో రానున్న పండుగల సీజన్‌లో డిమాండ్‌ పెరగొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-07-18T22:40:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising