ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టఫే చేతికి ఫోర్సియా ఇండియా

ABN, First Publish Date - 2022-12-31T03:21:54+05:30

ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల తయారీ కార్యకలాపాలు నిర్వహించే టఫే సంస్థ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల తయారీ కార్యకలాపాలు నిర్వహించే టఫే సంస్థ.. ఫ్రాన్స్‌కు చెందిన గ్లోబల్‌ ఆటోమోటివ్‌ సరఫరా గ్రూప్‌ ఫోర్వియాకు చెందిన భారత ఇంటీరియర్‌ సిస్టమ్స్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. అయి తే డీల్‌ విలువ ఎంత అన్నది వెల్లడించలేదు. మహారాష్ట్రలోని చకాన్‌, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, తమిళనాడుల్లో ఫోర్వియా గ్రూప్‌ అనుబంధ విభాగం ఫోర్సియాకు గల తయారీ యూనిట్లు ఈ డీల్‌లో భాగంగా టఫే చేతికి వస్తాయి. వీటిలో చకాన్‌, అనంతపురం ప్లాంట్ల లావాదేవీ పూర్తయిందని, తమిళనాడు ప్లాంట్‌కు సంబంధించిన లావాదేవీని కూడా త్వరలో పూర్తి చేస్తామని టఫే ప్రకటించింది. టఫే ట్రాక్టర్ల వ్యాపారంతో పాటు ఇంజనీరింగ్‌ ప్లాస్టిక్స్‌ వ్యాపారం, ఆటోమోటివ్‌ ఇంజనీర్డ్‌ ప్లాస్టిక్‌ వ్యాపారం ఉన్నాయి. ప్రధాన ఆటోమొబైల్‌ కంపెనీలకు ఎక్స్‌టీరియర్‌, ఇంటీరియర్‌ ఇంజనీర్డ్‌ ప్లాస్టిక్‌ విడిభాగాలు టఫే సరఫరా చేస్తుంది. టఫే ప్లాస్టిక్‌ బిజినెస్‌, ఫోర్సియాకు చెందిన ఇంటీరియర్‌ సిస్టమ్స్‌ వ్యాపారం రెండింటినీ ఇంటిగ్రేట్‌ చేయడం వల్ల తమ కస్టమర్లకు మరింత ప్రయోజనం కలుగుతుందని టఫే తెలిపింది.

Updated Date - 2022-12-31T03:21:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising