ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థిక పరిస్థితులు బాగా లేవు

ABN, First Publish Date - 2022-11-28T01:09:05+05:30

వడ్డీ రేట్లు పెంచడంలో దూకుడు తగ్గించాలని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)ను భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కోరింది. లేకపోతే వృద్ధి రేటుతో పాటు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్‌బీఐ వడ్డీ రేట్ల దూకుడు ఆపాలి : సీఐఐ

న్యూఢిల్లీ: వడ్డీ రేట్లు పెంచడంలో దూకుడు తగ్గించాలని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)ను భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కోరింది. లేకపోతే వృద్ధి రేటుతో పాటు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న డిమాండ్‌ మళ్లీ గాడి తప్పే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబరు)లో కంపెనీల ఆదాయాలు, లాభాల వృద్ధి రేటు తగ్గిన విషయాన్ని సీఐఐ గుర్తు చేసింది. డిసెంబరు తొలి వారంలో ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో సీఐఐ ఈ విజ్ఞప్తి చేయడం విశేషం. ఈ భేటీలోనైనా కీలక రెపో రేటు పెంపు 25 బేసిస్‌ పాయింట్ల (పావు శాతం) నుంచి 30 బేసిస్‌ పాయింట్లు మించకుండా చూడాలని కోరింది. గత ఆరు నెలల్లో ఆర్‌బీఐ కీలక రెపో రేటును నాలుగు శాతం నుంచి 5.9 శాతానికి పెంచింది. డిసెంబరులో జరిగే సమావేశంలో ఎంపీసీ రెపో రేటు మరో అర శాతం పెంచి 6.4 శాతం చేస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఐఐ ఈ విజ్ఞప్తి చేయడం విశేషం.

Updated Date - 2022-11-28T01:09:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising