ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈపీఎఫ్‌ఓ... కొత్త నిబంధన... పిపంఛనుదారులకు వెసులుబాటు...

ABN, First Publish Date - 2022-01-26T23:48:52+05:30

పిపంఛనుదారులకు ఎంప్లాయీస్ పెన్షన్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) వెసులుబాటు కల్పించింది. తుది గడువు లోపల పింఛను అందనిపక్షంలో... పరిహారాన్ని పొందే అవకాశాన్ని కల్పించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పిపంఛనుదారులకు ఎంప్లాయీస్ పెన్షన్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) వెసులుబాటు కల్పించింది. తుది గడువు లోపల పింఛను అందనిపక్షంలో... పరిహారాన్ని పొందే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ అయ్యింది. పిపంఛనుదారులకు  ప్రతి నెలా చివరి పనిదినాన పింఛను అందుతుందన్న విషయం తెలిసిందే. తాజా ఆదేశాల నేపధ్యంలో... పింఛను అందడం ఆలస్యమైనపక్షంలో... ప్రభుత్వం పరుిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో... ప్రతి నెలా చివరి తేదీన పిపంఛనుదారులకు  ఖాతాల్లో పింఛను డబ్బు జమ కావాల్సి ఉంటుంది. అన్ని ప్రాంతీయ కార్యాలయాలు నెలవారీ బీఆర్ఎస్‌ను బ్యాంకులకు పంపించాలని, దీంతో బ్యాంకులు చివరి పని దినాన పిపంఛనుదారుల ఖాతాల్లోకి పింఛను అందుతుందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు నెల ఒకటి, లేదా 5 వ తేదీన బ్యాంకులకు పింఛను మొత్తాన్ని జమ చేస్తున్నారు. అయితే...  ప్రస్తుత విధానంలో నెల చివరన రెండు రోజుల ముందుగా బ్యాంకులకు పిపంఛను మొత్తం వస్తుంది.


రూరల్ పీఎఫ్ కార్యాలయాల నుంచి పనింఛను చెల్లింపు బిల్లులు సకాలంలో అందకపోవడంతో కొన్ని బ్యాంకులు గడువు తేదీ నాటికి ఖాతాల్లో జమ చేయడం లేదని, ఈ క్రమంలో... పీఎఫ్ పింఛనుదారులు ఇబ్బందులు పడుతున్నారని ఈపీఎఫ్ఓ గుర్తించింది. దీనిపై స్పందించిన ఈపీఎఫ్ఓ... ప్రతి నెలా చివరి రోజున ఖాతాల్లోకి పింఛను డబ్బు వచ్చేలా చర్యలు తీసుకుంది. ఇక... ఉద్యోగులు పీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవాలంటే, 77382 99899 లేదా 011 22901406 నెంబర్లకు డయల్ చేయొచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. దీని కోసం 'EPFOHO UAN LAN' టైప్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నంబరు నుంచి 77382 99899కి ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. 

Updated Date - 2022-01-26T23:48:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising