ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మితిమీరిన త్యాగం తగదు

ABN, First Publish Date - 2022-06-27T09:32:24+05:30

ద్రవ్యోల్బణాన్ని తక్షణం కట్టడి చేయాలన్న ప్రయత్నంలో భాగంగా వృద్ధిని మితిమీరి త్యాగం చేయడం మంచిది కాదని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మానిటరీ పాలసీ కమిటీ సభ్యుడు జయంత్‌ ఆర్‌ వర్మ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీసీ సభ్యుడు జయంత్‌ వర్మ

న్యూఢిల్లీ : ద్రవ్యోల్బణాన్ని తక్షణం కట్టడి చేయాలన్న ప్రయత్నంలో భాగంగా వృద్ధిని మితిమీరి త్యాగం చేయడం మంచిది కాదని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మానిటరీ పాలసీ కమిటీ సభ్యుడు జయంత్‌ ఆర్‌ వర్మ అన్నారు. కరోనా మహమ్మారి కల్లోలం నుంచి ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా బయటపడలేదని, ఈ కారణంగా వృద్ధిని మితిమీరి త్యాగం చేయడం ప్రతికూల ప్రభావానికి దారి తీస్తుందని హెచ్చరించారు. దీర్ఘకాలం పాటు సాగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, పెరిగిన కమోడిటీ ధరలను పరిగణనలోకి తీసుకుని 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు ప్రకటించిన  వృద్ధి అంచనాలు హేతుబద్ధంగానే ఉన్నాయని ఆయన సమర్థించారు. ఇటీవల ఆర్‌బీఐ రెపోరేటును రెండు విడతల్లో 0.90 శాతం పెంచిన నేపథ్యంలో కేంద్ర బ్యాంక్‌ వడ్డీ రేట్ల విషయంలో ఇక దూకుడుగానే ఉంటుందని పలు వర్గాలు అందోళన ప్రకటిస్తున్న దృష్ట్యా ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ద్రవ్యోల్బణ ఒత్తిడి ఊహించిన స్థాయి కన్నా చాలా ఎక్కువగా ఉన్న మాట వాస్తవమేనంటూ తాము ఆశిస్తున్న సమయం కన్నా ఎక్కువ కాలమే అవి కొనసాగవచ్చని, అయునా మధ్య కాలంలో దాన్ని లక్షిత స్థాయికి దింపగలమన్న విషయంలో తనకు ఎలాంటి అనుమానం లేదని వర్మ చెప్పారు.ఛి

Updated Date - 2022-06-27T09:32:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising