ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఈటీఎఫ్’... త్వరలో ప్రారంభం...

ABN, First Publish Date - 2022-01-14T20:37:21+05:30

తొలి బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌ను... టారస్ క్లింగ్ బ్లాక్‌చైన్ ఐఎఫ్‌ఎస్‌సీ భారత ప్రారంభించబోతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : తొలి బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌ను... టారస్ క్లింగ్ బ్లాక్‌చైన్ ఐఎఫ్‌ఎస్‌సీ భారత ప్రారంభించబోతోంది. ఇందుకోసం ఇండియా ఐఎన్ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ నుండి దీనిని త్వరలో ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన బ్లాక్‌చైన్ టెక్నాలజీ స్టార్టప్ టోరస్ క్లింగ్ ట్రేడింగ్ ఇండియా, రిలయన్స్ కేపిటల్ మాజీ సీఈవో శ్యామ్ ఘోష్ ఏర్పాటు చేసిన కాస్మియా ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌తో కలిసి దేశంలో తొలిసారి క్రిప్టో ఫ్యూచర్స్ ఈటీఎఫ్‌ను ఆవిష్కరించనుంది.


ఇందుకోసం టోరస్ క్లింగ్ బ్లాక్‌చైన్ ఐఎఫ్ఎస్‌సీ అనే సంయుక్త సంస్థను ఏర్పాటు చేయనున్నాయి. ఈ సంస్థ... క్రిప్టో ఫ్యూచర్స్ ఈటీఎఫ్‌ను తీసుకొచ్చేందుకుగాను... బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీకి చెందిన ఇండియా ఐఎన్ఎక్స్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. గిఫ్ట్ సిటీ నుండి దీనిని త్వరలో ఆవిష్కరించనున్నట్లు టోరస్ క్లింగ్ బ్లాక్ చైన్ ఐఎఫ్‌ఎస్‌సీ వెల్లడించింది. ఇందులో బిట్‌కాయిన్, ఎథేరియం ఫ్యూచర్స్ ఈటీఎఫ్‌లు ఉంటాయి.


అమెరికా వెలుపల మొదటి క్రిఫ్టో ఫ్యూచర్స్ ఈటీఎఫ్ కావడం దీని ప్రత్యేకం. దీంతో పాటు అమెరికాలో నమోదైన మెటావర్స్ లార్జ్ క్యాప్ డిస్కౌంట్ సర్టిఫికెట్లను కూడా అందించనుంది. క్రిప్టో ఫ్యూచర్స్ ఈటీఎఫ్‌ను... ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మార్కెటింగ్ వ్యవస్థ, భాగస్వాముల ద్వారా పంపిణీ చేస్తామని టోరస్ క్లింగ్ వెల్లడించింది. రానున్న రెండేళ్ల కాలంలో రూ. 7,500 కోట్ల క్రిఫ్టో ఫ్యూచర్స్ ఈటీఎఫ్, డిస్కౌంట్ సర్టిఫికెట్స్ టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Updated Date - 2022-01-14T20:37:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising