ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Equity markets: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 60 వేల మార్క్ దిగువన సెన్సెక్స్..

ABN, First Publish Date - 2022-09-20T21:45:48+05:30

వరుసగా 2వ రోజు మంగళవారం సెషన్‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్(BSE sensex) 578.51 పాయింట్లు(0.98 శాతం) వృద్ధి చెంది 60 వేల మార్క్ దిగువన 59,719

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: వరుసగా 2వ సెషన్ అయిన మంగళవారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు(eqity) లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్(BSE sensex) 578.51 పాయింట్లు(0.98 శాతం) వృద్ధి చెంది 60 వేల మార్క్ దిగువన 59,719.74 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో గరిష్ఠంగా 60,106 పాయింట్ల మార్క్‌ను తాకింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ(nse nifty) 194 పాయింట్లు(1.1 శాతం) లాభపడి 17,816 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో గరిష్ఠంగా 17,919 పాయింట్ల మార్క్‌ను తాకింది. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1.4 శాతం వరకు లాభపడ్డాయి. ఫార్మా స్టాక్స్ లాభాల్లో దూసుకెళ్లడం మార్కెట్లకు దన్నుగా నిలిచింది.


కాగా ఆసియా మార్కెట్ల ర్యాలీకి అనుగుణంగా దేశీయ మార్కెట్లలో దూకుడు కొనసాగింది. ఇన్వెస్టర్లు  కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మార్కెట్లు దూసుకెళ్లాయి. పలు రంగాల షేర్లు లాభాల్లో దూసుకెళ్లాయి. అత్యధికంగా నిఫ్టీ ఫార్మా సూచీ దాదాపు 3 శాతం లాభపడింది. ఆ తర్వాత నిఫ్టీ ఆటో, ప్రైవేటు బ్యాంక్ సూచీలు 1.7 శాతం వరకు వృద్ధి చెందాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ అత్యుల్పంగా 0.5 శాతం మాత్రమే పెరిగింది. 

Updated Date - 2022-09-20T21:45:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising