ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదరగొట్టిన Bullet బండి కంపెనీ.. అమ్మకాల్లో దుమ్ములేపడంతో షేర్లు జోరందుకున్నాయ్..

ABN, First Publish Date - 2022-07-22T20:06:22+05:30

మోటార్‌ సైకిల్ ఐకానిక్ బ్రాండ్(Iconic Brand) రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) తయారీదారు ఐషర్ మోటార్స్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Eicher Motors : మోటార్‌ సైకిల్ ఐకానిక్ బ్రాండ్(Iconic Brand) రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) తయారీదారు ఐషర్ మోటార్స్ షేర్లు నేడు దుమ్మురేపాయి. నాలుగు సంవత్సరాల గరిష్ట స్థాయి రూ. 3,179.15కి చేరాయి, అదిరిపోయే డిమాండ్ ఔట్‌లుక్‌తో శుక్రవారం ఇంట్రా-డేలో కంపెనీ షేర్లు 3 శాతం లాభపడ్డాయి. రాబోయే పండుగ సీజన్‌(Festival Season)లో కొత్త లాంచ్‌లు ఉండటం.. డిమాండ్‌లో బలమైన పిక్-అప్ అంచనాలతో స్టాక్ ఊపందుకుంది. 


మోటార్‌సైకిళ్లు, వాణిజ్య వాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న ఆటోమొబైల్ కంపెనీ(Automobile Company) స్టాక్ ఏప్రిల్ 2018 నుంచి అత్యధికంగానే ట్రేడవుతోంది. ఇది సెప్టెంబర్ 8, 2017న రికార్డు స్థాయిలో రూ. 3,348కి చేరుకుంది. గత ఒక నెలలో ఐషర్ మోటార్స్ దాదాపు 20 శాతం పెరిగి మార్కెట్‌తో పోలిస్తే అవుట్ పెర్ఫార్మ్ చేసింది. ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్‌లో 7.8 శాతం పెరిగింది. 


ఐషర్ మోటార్స్ మొత్తం మోటార్‌సైకిళ్ల (Royal Enfield) విక్రయాలు గత ఏడాది జూన్‌లో విక్రయించిన 43,048 యూనిట్ల నుంచి జూన్ 2022లో 43 శాతం పెరిగి 61,407 యూనిట్లకు చేరాయి. 350 cc వరకూ ఇంజిన్ కెపాసిటీ(Engine Capacity) ఉన్న మోటార్‌సైకిల్ మోడళ్ల అమ్మకాలు ఏడాదికి 35 శాతం పెరిగి 50,405 యూనిట్లకు చేరుకున్నాయి, 350 cc కంటే ఎక్కువ ఇంజన్ కెపాసిటీ ఉన్న మోటార్‌సైకిల్ మోడల్‌ల అమ్మకాలు జూన్ 2021లో జూన్ 2022లో 90 శాతం పెరిగి 11,002 యూనిట్లకు చేరుకున్నాయి.  

Updated Date - 2022-07-22T20:06:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising