ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UPI-UPI Lite: అందరూ యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు సరే.. మరి ‘యూపీఐ లైట్’ పేమెంట్స్ గురించి తెలుసా...

ABN, First Publish Date - 2022-10-04T19:56:24+05:30

దేశంలో కరోనా తర్వాత యుపీఐ పేమెంట్ల(UPI payments) వినియోగం భారీగా పెరిగిపోయింది. చిన్న కిరణా దుకాణాల నుంచి పెద్దపెద్ద మాల్స్ వరకు అత్యధిక చెల్లింపులు యుపీఐ రూపంలోనే జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశంలో కరోనా తర్వాత యూపీఐ పేమెంట్ల(UPI payments) వినియోగం భారీగా పెరిగిపోయింది. చిన్న కిరణా దుకాణాల నుంచి పెద్దపెద్ద మాల్స్ వరకు  అత్యధిక చెల్లింపులు యూపీఐ రూపంలోనే జరుగుతున్నాయి. ఇందుకోసం యూజర్లు ఫోన్‌పే (PhonePe), గూగుల్ పే (Google pay), భిమ్‌(BHIM)తోపాటు ఇతర యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇలా క్రమంగా యూపీఐ పేమెంట్లకు ఆదరణ భారీగా పెరిగిపోతోంది. అయితే ‘యూపీఐ లైట్’ (UPI Lite) గురించి యూజర్లకు పెద్దగా తెలియదు. మరి యూపీఐ అంటే ఏమిటి, యూపీఐ లైట్ అంటే ఏమిటి, ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలేంటో మీరూ ఓ లుక్కేయండి..


యూపీఐ గురించి తెలిసిందే...

యూపీఐ (UPI) అనేది 24 గంటలపాటు అందుబాటులో ఉండే ఇన్‌స్టంట్ పేమెంట్ సిస్టమ్. రియల్ టైమ్‌లో రెండు బ్యాంక్ అకౌంట్ల మధ్య నగదు బదిలీ చేసుకోవచ్చు. యూపీఐలో లావాదేవీ గరిష్ఠ పరిమితి రూ.2 లక్షలుగా ఉంటుంది. యూపీఐ పేమెంట్ సిస్టమ్‌లో పిన్ తప్పనిసరిగా ఉండాలి. పిన్ నంబర్ 4 - 6 అంకెల మధ్య ఉంటుంది. యూపీఐ విధానంలో డబ్బును పంపించడంతోపాటు రిసీవ్ కూడా చేసుకోవచ్చు. యూపీఐ వినియోగ పరిధి చాలా ఎక్కువగా ఉంది. 100కిపైగా బ్యాంకులకు చెందిన ఖాతాదారులు భిమ్, గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే లేదా బ్యాంకింగ్ యాప్స్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. 


యూపీఐ లైట్ అంటే ఏమిటి?

యూపీఐ లైట్ (UPI Lite) అనేది ఆన్‌-డివైజ్ వాలెట్. దీన్ని ద్వారా యూజర్లు తక్కువ విలువైన పేమెంట్లు చేయవచ్చు. యూపీఐ లైట్‌లో లావాదేవీ గరిష్ఠ పరిమితి కేవలం రూ.200 మాత్రమే. ఆన్‌-డివైజ్ వాలెట్‌లో రూ.2000 వరకు బ్యాలెన్స్‌ ఉంచుకోవచ్చు. అయితే యూపీఐ లైట్‌ యూజర్లకు పిన్ అవసరం లేకుండానే లావాదేవీలు నిర్వహించవచ్చు. మరి యూపీఐ లైట్‌లో డబ్బు పంపించడంతోపాటు రిసీవ్ చేసుకోవచ్చా? అంటే కుదరదనే చెప్పాలి. కేవలం డబ్బును పంపించడానికి మాత్రమే వీలుంటుంది. యూపీఐ లైట్ వాలెట్‌లో క్రెడిట్ అయ్యే డబ్బంతా ఖాతాదారుడి బ్యాంక్ అకౌంట్‌లోనే జమవుతుంది. కాగా యూపీఐ లైట్‌ భిమ్ యాప్‌పై అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి 8 బ్యాంకులకు చెందిన ఖాతాదారులు యూపీఐ లైట్‌ని ఉపయోగించుకునే సౌలభ్యం ఉంది. యూపీఐ లైట్ వినియోగం వల్ల ప్రత్యేకంగా ఉపయోగాలేంటీ అంటే... ఆఫ్‌లైన్‌లో కూడా పేమెంట్లు చేయవచ్చు. దీంతో మరింత సమర్థవంతంగా పేమెంట్లు చేయడంతోపాటు బ్యాంకింగ్ సిస్టమ్‌పై భారం కూడా తగ్గుతుంది. అయితే తక్కువ స్థాయి లావాదేవీల కోసం మాత్రమే యూపీఐ లైట్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. యూపీఐ లైట్ అందుబాటులో ఉన్న భిమ్ యాప్‌ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లపై డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Updated Date - 2022-10-04T19:56:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising