ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

GST శ్లాబ్‌లపై చర్చలు జరుగుతున్నాయి... కేంద్రం

ABN, First Publish Date - 2022-07-05T00:41:21+05:30

లగ్జరీ ఉత్పత్తులపై అత్యధిక GST(28 శాతం) కొనసాగుతుందని రెవెన్యూ సెక్రటరీ తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : : లగ్జరీ ఉత్పత్తులపై అత్యధిక GST(28 శాతం) కొనసాగుతుందని రెవెన్యూ సెక్రటరీ తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. మూడు శ్లాబులు... 5 శాతం, 12 శాతం, 18 శాతాలను రెండుగా కుదించడంపై చర్చలు జరుగుతున్నాయని తరుణ్ బజాజ్ చెప్పారు. పెట్రో ఉత్పత్తులను GST పరిధిలోకి  తీసుకురావాలని డిమాండ్ ఉందని తరుణ్ చెప్పారు. అయితే... ఫ్యూయల్‌ను GST కిందకు తీసుకురావడంపై విముఖత ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో...కొంత కాలం పాటు తాము వేచి చూడాల్సి ఉందని పేర్కొన్నారు. 


నాలుగు శ్లాబుల GST కింద, నిత్యావసర వస్తువులపై 5 శాతం GSTని విధిస్తుండగా.. లగ్జరీ కార్లపై 28 శాతం లెవీని విధింపు జరుగుతోంది. ఇతర పన్ను రేట్లు 12 శాతం, 18 శాతంగా ఉన్నాయి. గోల్డ్, జ్యూవెల్లరీ, విలువైన రాళ్లపై స్పెషల్‌గా 3 శాతం GST  ఉన్న విషయం తెలిసిందే. కట్, పాలిష్డ్ డైమండ్లపై 1.5 శాతం GSTని విధిస్తున్నారు. లగ్జరీ, సిన్, డీమెరిట్ గూడ్స్‌పై అత్యధికంగా 28 శాతం పన్నును, సెస్‌ను విధిస్తున్నారు. ఈ సెస్‌ను పరిహారాల నిధిలో జమ చేస్తోంది. ఇలా జమ చేసిన మొత్తాన్ని GST నేపథ్యంలో... రెవెన్యూ కోల్పోతోన్న రాష్ట్రాలకు పరిహారాలుగా అందిస్తోన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2022-07-05T00:41:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising