ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్జాతీయ ట్రెండ్స్‌తోనే దిశ !

ABN, First Publish Date - 2022-05-23T08:43:06+05:30

అంతర్జాతీయ అంశాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐ) గమనం ఈ వారం మార్కెట్‌ దిశను నిర్దేశించే వీలుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంతర్జాతీయ అంశాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్‌ఐఐ) గమనం ఈ వారం మార్కెట్‌ దిశను నిర్దేశించే వీలుంది. ఈ వారం డెరివేటివ్స్‌ ముగింపు ఉండటంతో దేశీయ మార్కెట్లు ఆటుపోట్లలోనే సాగే వీలుంది. గత వారం మార్కెట్లు పుల్‌బ్యాక్‌ ర్యాలీని కనబరిచినప్పటికీ ఈ వారం దాన్ని నిలబెట్టుకుంటుందా లేదా అనేది చెప్పటం కష్టమే. నిఫ్టీకి 15700-15600 వద్ద బలమైన మద్దతు స్థాయిలున్నాయి. అయితే ఈ కీలక స్థాయిలకు ఎగువన ఉండటం ఒక్కటే సానుకూల అంశం. ఒకవేళ అప్‌ట్రెండ్‌లో సాగితే నిఫ్టీకి 16400,16500,16600 వద్ద నిరోధ స్థాయిలుంటాయి.       


స్టాక్‌ రికమండేషన్స్‌ 

పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ: గడిచిన పది నెలలుగా ఈ షేరు పూర్తిగా నెగటివ్‌ ధోరణిలోనే సాగుతూ వచ్చింది. అయితే గత వారం 200 రోజుల ఎస్‌ఎంఏ నుంచి బయటపడి సానుకూల ట్రెండ్‌లోకి ప్రవేశించింది. డైలీ వాల్యూమ్స్‌ చూస్తే బలమైన మద్దతుతో ముందుకు సాగుతోంది. గత శుక్రవారం రూ.227.95 వద్ద క్లోజైన ఈ షేరును రూ.245 స్థాయిని టార్గెట్‌గా పెట్టుకుని కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.217.80 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 


యాక్సిస్‌ బ్యాంక్‌: ఫైనాన్షియల్‌ విభాగంలోని ఈ షేరు కొన్ని నెలలుగా పూర్తిగా నెగటివ్‌ ట్రెండ్‌ను కనబరుస్తూ వస్తోంది. ఈ షేరు ఇటీవలి గరిష్ఠ స్థాయిల నుంచి దాదాపు 20 శాతానికి పైగా కరెక్షన్‌ను చవిచూసింది. చివరకు గత వారం ఓవర్‌సోల్డ్‌ టెరిటరీ నుంచి బయటపడి రూ.640-630 వద్ద బలమైన మద్దతు స్థాయిలను ఏర్పరచుకుంది. ఈ వారం కూడా ఈ షేరులో రిలీఫ్‌ ర్యాలీ ఉండే అవకాశం ఉంది. గత శుక్రవారం రూ.673.10 వద్ద క్లోజైన ఈ షేరును స్వల్పకాలానికి రూ.700 స్థాయిని టార్గెట్‌గా పెట్టుకుని కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.657 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 

- సమీత్‌ చవాన్‌, చీఫ్‌ ఎనలిస్ట్‌,టెక్నికల్‌, 

డెరివేటివ్స్‌, ఏంజెల్‌ వన్‌ లిమిటెడ్‌ 

Updated Date - 2022-05-23T08:43:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising