ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో డిజిటల్‌ అసమానతలూ అధికమే..

ABN, First Publish Date - 2022-12-06T01:20:06+05:30

భారత్‌లో ఆర్థిక పరంగానే కాదు, డిజిటల్‌ అసమానతలూ అధికమేనని ఆక్స్‌ఫామ్‌ ఇండియా అంటోంది. గత ఏడాదిలో మొబైల్‌ ఫోన్లు కలిగిన పురుషుల వాటా 61 శాతంగా ఉండగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొబైల్‌ వినియోగదారుల్లో పురుషులే అధికం

  • ఎస్సీ, ఎస్టీల్లో కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌

    కలిగిన వారు 2% లోపే.. సాధారణ కులాల్లో 8ు

  • ఆక్స్‌ఫామ్‌ ఇండియా నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: భారత్‌లో ఆర్థిక పరంగానే కాదు, డిజిటల్‌ అసమానతలూ అధికమేనని ఆక్స్‌ఫామ్‌ ఇండియా అంటోంది. గత ఏడాదిలో మొబైల్‌ ఫోన్లు కలిగిన పురుషుల వాటా 61 శాతంగా ఉండగా.. మహిళల్లో 31 శాతం మాత్రమే ఫోన్లు వినియోగిస్తున్నట్లు తెలిపింది. కులం, మతం, లింగం, వర్గం, ప్రాంతం పరంగా భారత్‌లో పెరిగిన అసమానతలు డిజిటల్‌ విభాగంలోనూ ప్రతిబింబిస్తున్నాయని సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. మరిన్ని విషయాలు..

  • డిజిటల్‌ సాంకేతికతల అందుబాటు ప్రధానంగా మగవారు, పట్టణ ప్రాంత, ఉన్నత కులాల కుటుంబాలు లేదా వ్యక్తులకే పరిమితంగా ఉంది.

  • సాధారణ కులాలకు చెందినవారిలో 8 శాతం మాత్రమే కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ కలిగి ఉన్నారు. ఎస్టీల్లో ఈ వాటా 1 శాతం లోపే. ఎస్సీల్లో 2 శాతంగా ఉంది.

  • మొబైల్‌ వినియోగంలో లింగ వ్యత్యాసంపై జీఎ్‌సఎంఏ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గత ఏడాదిలో మగవారితో పోలిస్తే మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలు వినియోగించుకున్న మహిళలు 33 శాతం తక్కువ. మగవారిలో 61 శాతం ఫోన్లు వాడుతుండగా.. మహిళల్లో ఈ వాటా 31 శాతమే.

  • గత ఏడాది పర్మినెంట్‌ ఉద్యోగుల్లో 95 శాతం మంది మొబైల్‌ కలిగి ఉండగా.. నిరుద్యోగుల్లో ఈ వాటా 50 శాతమే.

  • కరోనా సంక్షోభంతో కంప్యూటర్ల వినియోగం పెరిగిందనడానికి భిన్నంగా.. ప్రీ-కొవిడ్‌ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో 3 శాతం కంప్యూటర్లు కలిగి ఉండగా.. కరోనా సంక్షోభ తర్వాత కాలంలో ఈ వాటా 1 శాతానికి తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో 8 శాతం మంది కంప్యూటర్లు కలిగి ఉన్నారు.

  • విద్య, వైద్య సేవలందించేందుకు డిజిటల్‌ సాంకేతికతల వినియోగంలోనూ అసమానతలు కన్పించాయి. పేదల ఆదాయ స్థాయిని పెంచడం ద్వారా దేశంలో ఆర్థిక అసమానతలను తగ్గించాలి. ఇందుకోసం సముచిత స్థాయి కనీస వేతనాన్ని నిర్దేశించడం, ప్రజలపై పరోక్ష పన్నుల భారం తగ్గించడంతో పాటు సార్వజనీక విద్య, వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలి. డిజిటల్‌ అసమానతలను పూడ్చేందుకు సేవలను అందరికీ అందుబాటులోకి తేవాలి.

కులం, మతం, లింగం, వర్గం, ప్రాంతాల ఆధారిత అసమానతలు డిజిటల్‌ విభాగాలోనూ ప్రతిబింబిస్తున్నాయి. డిజిటల్‌ డివైజ్‌లు, ఇంటర్నెట్‌ సేవలు లేనివారు విద్య, వైద్యం, ప్రభుత్వ సేవలను వినియోగించుకోలేక మరింత వెనకబడిపోతున్నారు. ఈ అసమానతల విషవలయాన్ని నిరోధించాల్సిన అవసరం ఉంది.

అమితాబ్‌ బెహర్‌,

ఆక్స్‌ఫామ్‌ ఇండియా సీఈఓ

Updated Date - 2022-12-06T11:46:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising