ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీఏ హయాంలో అభివృద్ధి కుంటుపడింది

ABN, First Publish Date - 2022-09-24T08:14:50+05:30

ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి.. గత యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యూపీఏ హయాంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్ణయాలు తీసుకోవడంలోనూ అలసత్వం

ఇన్ఫోసిస్‌ కో ఫౌండర్‌ ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి

అహ్మదాబాద్‌: ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి.. గత యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యూపీఏ హయాంలో మన దేశంలో ఆర్థిక కార్యకలాపాలు కుంటు పడ్డాయన్నారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఆ ప్రభుత్వం విఫలమైందన్నారు. అహ్మదాబాద్‌ ఐఐఎంలో విద్యార్థులు, ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మూర్తి ఈ విమర్శలు చేశారు. ప్రస్తుత యువతరమే మన దేశాన్ని చైనాకు దీటైన పోటీదారుగా తీర్చిదిద్దగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. 


2008-12 మధ్య కాలంలో లండన్‌లోని హెచ్‌ఎస్‌బీసీ బోర్డులో సభ్యుడిగా ఉన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తొలి కొద్ది సంవత్సరాల్లో బోర్డు సమావేశాల్లో చైనా గురించి రెండు మూడు సార్లు ప్రస్తావిస్తే భారత్‌ పేరు ఒకసారైనా వచ్చేదన్నారు. 2012లో తాను హెచ్‌ఎస్‌బీసీ బోర్డు నుంచి తప్పుకునే నాటికి మన దేశం పేరే ఎత్తేవారు కాదన్నారు. ‘మన్మోహన్‌ సింగ్‌ అసాధారణ వ్యక్తి. ఆయనపై నాకు అమితమైన గౌరవం ఉంది. అయినా ఆయన హయాంలో మన దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పడకేశాయి. నిర్ణయాలు తీసుకోవడంలోనూ అసాధారణ జాప్యం జరిగేది. కారణం ఏంటో నాకు తెలియదు’ అని నారాయణ మూర్తి అన్నారు. ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడంతో ప్రస్తుతం ప్రపంచంలో మన గౌరవమూ కొంత పెరిగిందన్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌ సింగ్‌ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు, బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న భారత్‌లో తయారీ, స్టార్టప్‌ ఇండియా వంటి పథకాలు ఇందుకు కారణమని మూర్తి స్పష్టం చేశారు. 

Updated Date - 2022-09-24T08:14:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising