వారసులను దూరంగా ఉంచాల్సింది కాదు
ABN, First Publish Date - 2022-12-16T00:47:57+05:30
వారసులను దూరంగా ఉంచాల్సింది కాదుఇన్ఫోసి్‌సలో నాయకత్వ పదవులకు మా (సహ వ్యవస్థాపకుల) కుటుంబ సభ్యులను దూరంగా ఉంచి తప్పు చేశామని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన..
వారసులను దూరంగా ఉంచాల్సింది కాదుఇన్ఫోసి్‌సలో నాయకత్వ పదవులకు మా (సహ వ్యవస్థాపకుల) కుటుంబ సభ్యులను దూరంగా ఉంచి తప్పు చేశామని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి బహిరంగంగా ఒప్పుకున్నారు. దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మా వారసులను కంపెనీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా దూరంపెట్టడంలో నాదే తప్పని ఒప్పుకుంటు న్నా. అలా చేస్తే, ఈ సంస్థ చట్టబద్ధమైన ప్రతిభను కోల్పోతుందని భావించాను. గతంలో నేను అన్న మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా ను. ఏదైనా పదవిని చేపట్టేందుకు అన్ని రకాల అర్హతలు కలిగి ఉంటే, ప్రతి వ్యక్తి ఇతరులతో సమానంగా అవకాశాలు కలిగి ఉండాలని నాకిప్పుడు అనిపిస్తోంది’’ అని మూర్తి అన్నారు. అర్హత లేని వ్యక్తికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారేమోనన్న భయంతోనే అప్ప ట్లో అలా ఆలోచించాను, కంపెనీ భవిష్యత్ బలంగా ఉండాలనే నేను కోరకున్నా అని వివరించారు. అలాగని, భవిష్యత్‌లో తమ వారసులను సంస్థ నాయకత్వ స్థానాల్లో ప్రవేశపెట్టాలన్న ఆలోచన లేదని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒక రు, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకని స్పష్టం చేశారు. ‘‘ఏదో ఒక సమయంలో నా నుంచి చైర్మన్ బాధ్యతలు చేపట్టబోయే వ్యక్తి సంస్థకు వెలుపలి వ్యక్తే అవుతారు. ఈ విషయంలో మరో ఆలోచన లేదు. నా అవసరమైనంత కాలం కంపెనీకి సేవలందిస్తా. కానీ, ఎక్కువ కాలం ఈ పదవిలో కొనసాగాలనుకోవడం లేదు’’ నీలేకని అన్నారు.
నారాయణ మూర్తితోపాటు మరో ఆరుగురు కలిసి ఇన్ఫోసి్‌సను 1981లో ఏర్పాటు చేశారు. నారాయణ మూర్తి తన భార్య సుధా మూర్తి నుంచి రూ.10,000 అప్పుగా తీసుకుని ప్రారంభించిన ఇన్ఫీ ప్రస్తుతం రూ.6.65 లక్షల కోట్ల మార్కెట్ విలువతో దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా కొనసాగుతోంది. మూర్తి సహా ఇతర ప్రమోటర్ల పిల్లలెవ్వరూ కంపెనీలో పనిచేయలేదు. 2013 జూన్‌లో నారాయణ మూర్తి ఎగ్జిక్యూటివ్ చైర్మన్, డైరెక్టర్‌గా మళ్లీ బాధ్యతలు చేపట్టిన సమయంలో కూమారుడు రోహన్ మూర్తి ఆయనకు వ్యక్తిగత సహాయకుడిగా (ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్) మాత్రం సేవలందించారు. 2014 జూన్‌లో నారాయణమూర్తి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలోకి మారిన సమయంలో రోహన్ తన బాధ్యతల నుంచి వైదొలిగారు.
Updated Date - 2022-12-16T00:48:04+05:30 IST