ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ క్రిప్టో విలువ ‘సున్నా’

ABN, First Publish Date - 2022-05-15T07:48:54+05:30

ఆ క్రిప్టో విలువ ‘సున్నా’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల రోజుల్లో 100% శాతం తరిగిపోయిన లూనా 


రోజురోజుకు క్రిప్టోకరెన్సీల విలువ హరించుకుపోతోంది. నిన్నామొన్నటి వరకు ఇన్వెస్టర్లకు సిరులు కురిపించిన క్రిప్టోలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. ప్రపంచంలో ఎనిమిదో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ టెర్రాయూఎ్‌సడీకి సిస్టర్‌ టోకెన్‌గా ఉన్న లూనా విలువ ఏకంగా సున్నా డాలర్లకు పడిపోయింది. టెర్రాయూఎ్‌సడీ విలువ రోజురోజుకు పతనమవుతూ వస్తుండటంతో లూనా కూడా అదేబాటలో సాగింది.  గత నెల 5న 116 డాలర్ల వద్ద ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిలో ట్రేడయిన టెర్రా లూనా ఈ నెల 13 నాటికి 0 స్థాయికి పడిపోయి ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించింది. కేవలం 72 గంటల్లోనే దాదాపు 80 డాలర్లకు పైగా పతనమైంది. అంతేకాదు గడచిన ఏడు రోజుల్లో ఈ టోకెన్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కూడా 4,000 కోట్ల డాలర్ల నుంచి 60 లక్షల డాలర్లకు పడిపోయినట్లు కాయిన్‌మార్కెట్‌క్యా్‌ప వెబ్‌సైట్‌ వెల్లడించింది. తాజాగా సున్నా స్థాయికి చేరటంతో క్రిప్టో ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీ బైనాన్స్‌.. టెర్రాయూఎ్‌సడీ సహా లూనా ట్రేడింగ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో భారత క్రి ప్టో ఎక్స్ఛేంజీలు వజీరెక్స్‌, కాయిన్‌స్విచ్‌ కుబర్‌, కాయిన్‌డీసీఎక్స్‌ కూడా లూనా ట్రేడింగ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. 

Updated Date - 2022-05-15T07:48:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising