ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదాయాలపై వినియోగదారుల ఆందోళన

ABN, First Publish Date - 2022-08-20T06:11:30+05:30

దేశ ఆర్థిక భవిష్యత్‌పై కంపెనీలు, వినియోగదారుల దృక్పధంలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాభాల వృద్ధిపై కంపెనీలు ఆశాజనకం


న్యూఢిల్లీ : దేశ ఆర్థిక భవిష్యత్‌పై కంపెనీలు, వినియోగదారుల దృక్పధంలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ముందు ముందు లాభాలకు ఢోకా ఉండదని కంపెనీలు భావిస్తుంటే, వినియోగదారులు మాత్రం ఆదాయాలు, కొలువులు అంత ఆశాజనకంగా ఉండవని భావిస్తున్నారు. కన్స్యూమర్‌ కాన్ఫిడెన్స్‌ సర్వే (సీసీఎస్‌), ఇండస్ట్రియల్‌ ఔట్‌లుక్‌ సర్వే (ఐఓఎస్‌) పేరుతో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఇటీవల నిర్వహించిన రెండు సర్వేల్లో ఈ విషయం తేలినట్టు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ సంస్థ పేర్కొంది. పారిశ్రామిక, వినియోగదారుల అభిప్రాయాల్లో గతంలో ఎన్నడూ ఇంత తేడా లేదని తెలిపింది. కొవిడ్‌కు ముందుతో పోలిస్తే సీసీఎస్‌ గత ఏడాది సెప్టెంబరు నాటికి సగానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) జూన్‌ త్రైమాసికానికి ఇది కోలుకుని 76.6 పాయింట్లకు చేరింది. గత ఏడాది కాలంగా ఐఓఎస్‌ మాత్రం 110 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. లాభాలపై పారిశ్రామిక రంగం గత రెండు దశాబ్ధాల్లో ఎన్నడూ ఇంత ఆశాజనకంగా లేదు. 

Updated Date - 2022-08-20T06:11:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising