ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిడ్డర్లతో కోల్ ఇండియా సమావేశం: అదానీ సహా పదకొండు కంపెనీల హాజరు

ABN, First Publish Date - 2022-06-22T00:05:44+05:30

Coal India Limited(CIL) అధికారులతో జరిగిన సమావేశానికి మొత్తం పదకొండు మంది బొగ్గు దిగుమతిదారులు హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : Coal India Limited(CIL) అధికారులతో జరిగిన సమావేశానికి మొత్తం పదకొండు మంది బొగ్గు దిగుమతిదారులు హాజరయ్యారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, మోహిత్ మినరల్స్, చెట్టినాడ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీలు హాజరైన వాటిలో ఉన్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని బొగ్గు మైనింగ్/రిఫైనింగ్ కంపెనీ, కోల్ ఇండియా లిమిటెడ్(CIL), మూడు అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్‌లలో పాల్గొనేందుకు ఆసక్తిని వ్యక్తం చేసిన బొగ్గు దిగుమతి ఏజెన్సీలతో జూన్ 14, 17 తేదీల్లో మూడు ప్రీ-బిడ్ సమావేశాలను నిర్వహించినట్లు ఈ రోజు(మంగళవారం) ప్రకటించింది.


ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో... బొగ్గు విదేశీ కొనుగోళ్లకు కంపెనీ ఈ-టెండర్లు నిర్వహిస్తోంది. బిడ్ డాక్యుమెంట్, పనికి సంబంధించిన పరిధి, తదితర అంశాలకు సంబంధించి అవగాహన పొందేందుకు ఆసక్తి ఉన్న బిడ్డర్‌లకు సహకరించేందుకు ఈ సమావేశాలను నిర్వహించారు. సీఐఎల్ అధికారులతో జరిగిన సమావేశానికి మొత్తం 11 మంది బొగ్గు దిగుమతిదారులు హాజరయ్యారు. హాజరైన ప్రముఖ భారతీయ సంస్థలలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, మోహిత్ మినరల్స్, చెట్టినాడ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. కొన్ని విదేశీ బొగ్గు ఎగుమతి సంస్థలు... ప్రత్యేకించి ఇండోనేషియాకు చెందిన కొన్ని అంతర్జాతీయ బొగ్గు ఎగుమతి కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమావేశాలలో... బిడ్డర్లు టెండర్‌లో కొన్ని ముఖ్యమైన మార్పులను ప్రతిపాదించారు, బిడ్ ధర చెల్లుబాటు వ్యవధిని 90 రోజుల నుండి 60 రోజులకు తగ్గించడం, మొదటి విడత కార్గోను అందించడానికి 4-6 వారాల కాలపరిమితిని నిర్ణయించడం వంటి అంశాలను బిడ్డర్లు సూచించినట్లు సమాచారం. కాగా... ఆయా అభ్యర్థనలకు ప్రతిస్పందనగా బిడ్ డాక్యుమెంట్‌ను CIL సవరించింది. అంతేకాకుండా... బిడ్డింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకుగాను కంపెనీ ఇప్పటికే ఇ-ప్రొక్యూర్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లో ఒక కొరిజెండమ్‌ను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-06-22T00:05:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising