ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వడ్డీ రేట్లు తగ్గించిన చైనా

ABN, First Publish Date - 2022-08-16T06:22:01+05:30

చైనా ఆర్థిక వ్యవస్థ ఆపసోపాలు పడుతోంది. ఈ సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకున్న 5.5 శాతం జీడీపీ వృద్ధి రేటు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్‌: చైనా ఆర్థిక వ్యవస్థ ఆపసోపాలు పడుతోంది. ఈ సంవత్సరానికి లక్ష్యంగా పెట్టుకున్న 5.5 శాతం జీడీపీ వృద్ధి రేటు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో చైనా కేంద్ర బ్యాంక్‌ అయిన పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా (పీబీసీ) ఏడాది కాలపరిమితిలోపు ఉండే రుణాలపై కనీస వడ్డీ రేటును 2.85 శాతం నుంచి 2.75 శాతానికి తగ్గించింది. దీనికి తోడుగా రుణ పరపతి పెంచేందుకు బ్యాంకులకు అదనంగా 6,000 కోట్ల డాలర్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతుంటే చైనా మాత్రం రేట్లను తగ్గించటం గమనార్హం.


ఎందుకంటే: గత ఆరు నెలల్లో చైనా జీడీపీ వృద్ధి రేటు 2.5 శాతం మించలేదు. వృద్ధి రేటు ఇలానే కొనసాగితే ఈ సంవత్సరం లక్ష్యంగా పెట్టుకున్న 5.5 శాతం జీడీపీ వృద్ధి రేటు అసాధ్యంగా మారింది. దీనికి తోడు జూలైలో ఫ్యాక్టరీల ఉత్పత్తి, రిటైల్‌ అమ్మకాలు నీరసించాయి. ఇళ్ల అమ్మకాలూ గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 28.8 శాతం  పడిపోయాయి. ఆర్థిక పరిస్థితులు విషమిస్తే తన పదవికే ముప్పు ఏర్పడుతుందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భయపడుతున్నట్టు సమాచారం. ఈ పరిస్థితి నుంచి బయటడేందు కే పీబీసీ రంగంలోకి దిగిందని భావిస్తున్నారు. 

Updated Date - 2022-08-16T06:22:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising