ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గోల్డ్ సేవింగ్స్ ఖాతా’ దిశగా కేంద్రం...

ABN, First Publish Date - 2022-01-26T00:14:00+05:30

బంగారం కొనుగోళ్ళ సందర్భాల్లో్నూ, ఆ తర్వాత కూడా పలు వ్యయాలను భరించాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : బంగారం కొనుగోళ్ళ సందర్భాల్లో్నూ, ఆ తర్వాత కూడా పలు వ్యయాలను భరించాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే... ఇకపై అలాంటివేమీ లేకుండా గోల్డ్ సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఏ బ్యాంకులోననా ఈ గోల్డ్ సేవింగ్స్ అకౌంట్‌ను ప్రారంభించవచ్చునని తెలుస్తోంది. అకౌంట్ ప్రారంభించిన తర్వాత... ఎప్పుడైనా ఒక గ్రాము బంగారానికి సమాన మొత్తాన్ని కనీసంగా డిపాజిట్ చేయవలసి ఉంటుందని తెలుస్తోంది.


అలాగే ప్రభుత్వ పూచీకత్తు కలిగిన సావరీన్ గోల్డ్ బాండ్స్‌ను ఈ ఖాతాలో కొనుగోలు చేసే వెసులుబాటును కల్పించనున్నారు. ఉపసంహరించుకోవాలనుకున్నప్పుడు ఆ రోజు బంగారం విలువ ఆధారంగా నగదు ఇస్తారు. అన్ని అకౌంట్స్ మాదిరిగానే దీనికి పాస్ బుక్ ఉండనుంది. డిపాజిట్ల , ఉపసంహరణను నోట్ చేసుకోవచ్చు. గోల్డ్ సేవింగ్స్ అకౌంట్ అంటే... సావరీన్ గోల్డ్ బాండ్స్ వంటిదే గోల్డ్ సేవింగ్స్ అకౌంట్ కూడా. అయితే...  గోల్డ్ బాండ్స్‌లో ఇనవెస్ట్ చేయాలంటే కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అదే సేవింగ్స్ అయితే నిత్యం అందుబాటులో ఉంటుంది. గ్రాము పసిడికి సమాన మొత్తంలో నగదును బ్యాంకులో గోల్డ్ సేవింగ్స్ అకౌంట్స్‌‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. గ్రాము నుండి ఎంత వరకైనా ఇందులో డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. నగదును ఉపసంహరించుకునే సమయంలో ఆ రోజు ధర ఆధారంగా బ్యాంకులు చెల్లిస్తాయి. బ్యాంకు పాస్ బుక్ కూడా జారీ చేస్తుంది. ఈ ఖాతాలోని డిపాజిట్లపై గోల్డ్ బాండ్స్ తరహాలో 2.5 శాతం చొప్పున వడ్డీని చెల్లిస్తాయి. 

Updated Date - 2022-01-26T00:14:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising