ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

EPFO Update: మీ ఖాతాలో పీఎఫ్ వడ్డీ జమవ్వలేదా?.. కేంద్రం చెప్పిన సమాధానం ఇదే..

ABN, First Publish Date - 2022-10-07T01:44:42+05:30

ఎంప్లాయిస్ ప్రొవిడెంట్ ఫండ్ (EPF) ఒక సేవింగ్స్ స్కీమ్. జీతాలపై ఆధారపడే ఉద్యోగుల భవిష్యత్‌కు భరోసా లాంటి ఈ స్కీమ్‌లో ప్రతి నెలా కొద్ది మొత్తంలో సేవింగ్స్ చేసుకుంటే రిటైర్మెంట్ కార్పస్‌గా పనికొస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఎంప్లాయిస్ ప్రొవిడెంట్ ఫండ్ (EPF) ఒక సేవింగ్స్ స్కీమ్. జీతాలపై ఆధారపడే ఉద్యోగుల భవిష్యత్‌ భరోసాగా ఉండే ఈ స్కీమ్‌లో ప్రతి నెలా కొంత మొత్తంలో సేవింగ్స్ చేసుకుంటే రిటైర్మెంట్ కార్పస్‌గా ఉపయోగపడుతుంది. ఈపీఎఫ్‌కు సంబంధించి ఇటు ఉద్యోగి, అటు యాజమాన్యం ఉద్యోగి ఖాతాకు భాగస్వామ్యం అందించాల్సి ఉంటుంది. అయితే గత కొంతకాలంగా పీఎఫ్ వడ్డీ ఉద్యోగుల ఖాతాల్లో జమవ్వడం లేదు. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేసింది. వడ్డీ చెల్లింపులు ఆలస్యమవడమంటే ఉద్యోగులు డబ్బు నష్టపోవడంకాదని స్పష్టతనిచ్చింది. టీవీ మోహన్‌దాస్ పేయ్ అనే వ్యక్తి ట్విటర్‌ వేదికగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ విధంగా బదులిచ్చింది.


‘‘ పీఎఫ్ సబ్‌స్ర్కైబర్లకు ఎలాంటి నష్టం జరగదు. ఈపీఎఫ్ సబ్‌స్ర్కైబర్లు అందరి ఖాతాల్లోనూ వడ్డీ జమవుతోంది. అయితే సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్ కారణంగా స్టేట్‌మెంట్స్‌లో కనిపించడంలేదు.  అకౌంట్‌కు సంబంధించి ‘ట్యాక్స్‌ ఇన్సిడెన్స్’లో ఈపీఎఫ్‌వో అప్‌గ్రేడేషన్ చేస్తోంది’’ అని ఫైనాన్స్ మినిస్ట్రీ వెల్లడించింది. ఈపీఎఫ్‌వో నుంచి బయటకు వెళ్లేందుకు సెటిల్మెంట్ కోరుతున్న చందాదారులతోపాటు విత్‌డ్రాయల్, పేమెంట్స్ కోరుతున్న సబ్‌స్ర్కైబర్లు అందరికీ వడ్డీ సహా జమవుతున్నాయి’’ అని పేర్కొంది. 


కాగా టీవీ మోహన్ దాస్ అనే వ్యక్తి ట్విటర్ వేదికగా ‘‘ డియర్ ఈపీఎఫ్‌వో.. నా వడ్డీ ఎక్కడ?. సంస్కరణలు అవసరం. ఉద్యోగ వ్యవస్థ అసమర్థత కారణంగా పౌరులు ఎందుకు బాధపడాలి?. దయచేసి సాయపడండి’’ అని పేర్కొంటూ పీఎం కార్యాలయం, ప్రధాని నరేంద్ర మోడీ, ఫైనాన్స్‌ మినిస్ట్రీ, నిర్మలా సీతారామన్‌ని ట్యాగ్ చేశారు. దీంతో ఫైనాన్స్ మినిస్ట్రీ స్పందించింది.



Updated Date - 2022-10-07T01:44:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising