17000 పైన నిలదొక్కుకోవాల్సిందే...
ABN, First Publish Date - 2022-10-17T09:39:36+05:30
నిఫ్టీ గత వారం నాటి డౌన్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ ప్రారంభమైనా కీలక స్థాయి 17000 వద్ద నిలదొక్కుకుంది.
టెక్ వ్యూ
నిఫ్టీ గత వారం నాటి డౌన్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ ప్రారంభమైనా కీలక స్థాయి 17000 వద్ద నిలదొక్కుకుంది. చివరికి శుక్రవారం బలమైన బౌన్స్‌బ్యాక్ సాధించినా డే కనిష్ఠస్థాయిలో క్లోజ్ కావడం గరిష్ఠ స్థాయిల్లో మరింత అప్రమత్తతను సూచిస్తోంది. అలాగే వారం మధ్యస్థాయిలో ముగిసింది. గత వారం మిశ్రమ ధోరణి కనబరిచినా 17000 కన్నా పైన నిలకడగా క్లోజయింది. శుక్రవారం అమెరికన్ మార్కెట్ బలమైన డౌన్‌ట్రెండ్ సాధించినందు వల్ల భారత మార్కెట్ కూడా సోమవారం నెగిటివ్ రియాక్షన్‌లో ప్రారంభం కావచ్చు. మరోసారి 17000 వద్ద పరీక్ష ఎదుర్కొనే ఆస్కారం ఉన్నందువల్ల స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. ఈ స్థాయిలో పరీక్ష ఎదుర్కొనడం వరుసగా ఇది నాల్గవ వారం.
బుల్లిష్ స్థాయిలు:
రియాక్షన్ అనంతరం రికవరీలో పడితే మైనర్ అప్‌ట్రెండ్ కోసం ప్రధాన నిరోధం 17200 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన స్వల్పకాలిక నిరోధం 17500.
బేరిష్ స్థాయిలు:
రియాక్షన్‌లో పడినా గత కొద్ది వారాలుగా మానసిక అవధి 17000 వద్ద కోలుకుంటోంది. సానుకూలత కోసం ఇక్కడ బలంగా కన్సాలిడేట్ కావాలి. విఫలమైతే స్వల్పకాలిక బలహీనతలో ప్రవేశిస్తుంది. ప్రధాన మద్దతు స్థాయిలు 16750, 16450.
బ్యాంక్ నిఫ్టీ:
ఈ సూచీ గత సోమవారం బలమైన అప్‌ట్రెండ్‌లో ప్రారంభమై చివరికి వారంలో 127 పాయింట్ల లాభంతో వారం గరిష్ఠ స్థాయిలో నిరోధ స్థాయి 39000 కన్నా పైన ముగిసింది. బలహీనత ప్రదర్శిస్తే సానుకూలత కోసం 38800 వద్ద తప్పనిసరిగా నిలదొక్కుకోవాలి. రికవరీలో పడితే స్వల్పకాలిక అప్‌ట్రెండ్ సాధించేందుకు నిరోధ స్థాయి 39300 కన్నా పైన నిలదొక్కుకోవాల్సి ఉంటుంది.
పాటర్న్:
గత వారం నిఫ్టీ 17500 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ వద్ద విఫలమయింది. మరోసారి 17000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ వద్ద పరీక్ష ఎదుర్కొంటోంది. సానుకూలత కోసం ఈ రేఖ కన్నా పైన నిలదొక్కుకోవాలి. అలాగే గత వారం 50 డిఎంఏ వద్ద మరోసారి విఫలమయింది. ఈ వారంలో మార్కెట్ 100, 200 డిఎంఏల వద్ద పరీక్ష ఎదుర్కొనబోతోంది. ఇక్కడ కన్సాలిడేషన్ తప్పనిసరి.
టైమ్: ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 17140, 17200
మద్దతు : 17000, 16940
www.sundartrends.in
Updated Date - 2022-10-17T09:39:36+05:30 IST