ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేరళలోని నాలుగు జిల్లాల్లో 4జీ ట్రయల్స్‌కు సిద్ధమైన బీఎస్ఎన్ఎల్

ABN, First Publish Date - 2022-04-19T21:34:39+05:30

కేరళలోని నాలుగు జిల్లాల్లో 4జీ సేవల ట్రయల్స్‌కు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సిద్ధమైంది. డిసెంబరులో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: కేరళలోని నాలుగు జిల్లాల్లో 4జీ ట్రయల్స్‌కు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సిద్ధమైంది. డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించేందుకు రెడీ అవుతున్న బీఎస్ఎన్ఎల్ ఈ ఏడాది ఆగస్టు నుంచి తిరువనంతపురం, ఎర్నాకుళం, కోజికోడ్, కన్నూర్‌లలో 4జీ ట్రయల్స్ ప్రారంభించాలని నిర్ణయించింది.


బీఎస్ఎన్ఎల్ నుంచి 4జీ సేవల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నప్పటికీ ఇందులో చైనా సరఫరాదారుల భాగస్వామ్యం ఉండడంతో కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)తో కలిసి 4జీ సేవల ప్రారంభానికి బీఎస్ఎన్ఎల్ సిద్ధమైంది.


ట్రయల్ లాంచ్ కోసం మొత్తం 800 టవర్లు ఏర్పాటు చేస్తుండగా వాటిలో అత్యధికం తిరువనంతపురం, ఎర్నాకుళంలోనే ఏర్పాటు చేస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ కేరళ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ సీవీ వినోద్ తెలిపారు. రియల్‌టైం టెస్టింగ్ కోసం మొబైల్ ట్రాఫిక్ ఎక్కువ కలిగిన పట్టణ ప్రాంతాలపైనే దృష్టి సారించినట్టు చెప్పారు. ట్రయల్ రన్ విజయవంతమైతే డిసెంబరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా 4జీని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 


Updated Date - 2022-04-19T21:34:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising