ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఎస్ఎన్ఎల్ నుంచి బ్రహ్మాండమైన ఆఫర్!

ABN, First Publish Date - 2022-01-08T02:11:53+05:30

వినియోగదారులను ఆకర్షించేందుకు పలు రకాల ప్లాన్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నప్రభుత్వ రంగ టెలికం సంస్థ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వినియోగదారులను ఆకర్షించేందుకు పలు రకాల ప్లాన్లు, ఆఫర్లు ప్రకటిస్తున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో బ్రహ్మాండమైన ఆఫర్‌ ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్‌కు మారే వినియోగదారులకు నెల రోజులపాటు అదనంగా 5జీబీ డేటాను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అదనంగా వచ్చే డేటా 30 రోజులపాటు, లేదంటే ప్రస్తుత ప్లాన్ కాలపరిమితి ముగిసే వరకు అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. 


బీఎస్ఎన్‌లోకి మారాలనుకునే వినియోగదారులకు కొన్ని కండిషన్లు కూడా పెట్టింది. బీఎస్ఎన్ఎల్‌లోకి ఎందుకు మారుతున్నదీ సామాజిక మాధ్యమాల్లో కారణం చెప్పాల్సి ఉంటుంది. #SwitchToBSNL హ్యాష్‌టాగ్‌ను ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో షేర్ చేయాలి. బీఎస్ఎన్‌ఎల్‌కు మారుతున్న రుజువులను పంపాలి. అలా చేస్తేనే అదనపు ప్రయోజనం లభిస్తుంది.


అంతేకాదు, ఆ తర్వాత కూడా బీఎస్ఎన్ఎల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ఫాలో కావాల్సి ఉంటుంది. యూజర్లు తమ ట్వీట్‌ స్క్రీన్‌షాట్‌ను నేరుగా మెసేజ్ ద్వారా కానీ, లేదంటే వాట్సాప్ నంబరు 9457086024లో గానీ షేర్ చేయొచ్చు. బీఎస్ఎన్ఎల్‌లోకి మారే వినియోగదారులు రీచార్జ్ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. నంబరు పోర్టుకు చెల్లించాల్సిన పనిలేదు. 

Updated Date - 2022-01-08T02:11:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising