ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Best 5G Smartphones: రూ. 20 వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే!

ABN, First Publish Date - 2022-10-11T22:58:47+05:30

దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. తొలుత కొన్ని నగరాల్లోనే ఇవి అందుబాటులో ఉన్నా వచ్చే ఏడాది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. తొలుత కొన్ని నగరాల్లోనే ఇవి అందుబాటులో ఉన్నా వచ్చే ఏడాది నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కొత్తగా ఫోన్ కొనుగోలు చేసేవారు 5జీ ఫోన్లనే కొంటున్నారు. ప్రస్తుతం 4జీ వాడుతున్న వారు కూడా 5జీకి అప్‌గ్రేడ్ కావాలని అనుకుంటున్నారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం గతేడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 5జీ ఫోన్ల వాట 18 శాతం. ఈ ఏడాది అది 40 శాతానికి చేరుకుంటుందని మార్కెట్ నిపుణుల అంచనా. ఈ నేపథ్యంలో రూ. 20 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.


వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్(OnePlus Nord CE 2 Lite)

6.59 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 12.0, ఆక్సిజన్ ఓఎస్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్, వెనకవైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్, 2ఎంపీ మాక్రో కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 128 జీబీ స్టోరేజ్, 6జీబీ/8జీబీ ర్యామ్ వేరియంట్స్, 33 క్విక్ చార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్లు ఇందులో ఉన్నాయి. 


రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్ (Redmi Note 11 Pro+)

6.67 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 6జీబీ/8జీబీ ర్యామ్ వేరియంట్లు, 64 జీబీ/128  జీబీ స్టోరేజీ వేరియంట్లు, 108 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 42 నిమిషాల్లో పూర్తిస్థాయిలో చార్జింగ్, 67 వాట్స్ క్విక్ చార్జింగ్,  


శాంసంగ్ గెలాక్సీ ఎం 33 (Samsung Galaxy M33)

శాంసంగ్ గెలాక్సీ ఎం 33లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ స్క్రీన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, ఎగ్జినోస్ 1280 ఆక్టాకోర్ ప్రాసెసర్, 6జీబీ/8జీబీ ర్యామ్ వేరియంట్లు, 128 జీబీ స్టోరేజీ, 50 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు నాలుగు కెమెరాలు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ రీడర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్స్ చార్జింగ్ స్పీడ్ వంటివి ఉన్నాయి. 


కొత్తగా 5జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు. 5జీకి అప్‌గ్రేడ్ కావాలనుకుంటున్న వారు ఈ ఫోన్లలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. వాటిలోని ఫీచర్లు, ధరను బట్టి అనుగుణంగా ఉన్న ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.

Updated Date - 2022-10-11T22:58:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising