ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏజెంట్లు హద్దు దాటితే బ్యాంకులదే బాధ్యత

ABN, First Publish Date - 2022-08-13T05:35:32+05:30

రుణ వసూళ్ల ఏజెంట్ల ఆగడాలకు చెక్‌ పడనుంది. దీనికి సంబంధించి ఆర్‌బీఐ శుక్రవారం మరిన్ని ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల ఆగడాలకు బ్యాంకులు, ఆయా ఆర్థిక సంస్థలే బాధ్యత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రుణ రికవరీ ఆగడాలపై ఆర్‌బీఐ కొరడా


ముంబై: రుణ వసూళ్ల ఏజెంట్ల ఆగడాలకు చెక్‌ పడనుంది. దీనికి సంబంధించి ఆర్‌బీఐ శుక్రవారం మరిన్ని ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల ఆగడాలకు బ్యాంకులు, ఆయా ఆర్థిక సంస్థలే బాధ్యత  వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. రుణ వసూళ్ల ఆగడాలు మితిమీరి పోతున్నాయని ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొన్ని ఫిన్‌టెక్‌ కంపెనీలు యాప్‌ల ద్వారా వారికి అప్పులిచ్చి, ఏజెంట్ల సాయంతో పెద్ద ఎత్తున ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫిన్‌టెక్‌ కంపెనీల్లో కొన్ని చైనా కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ద్రవ్య, పరపతి విధాన సమీక్షలోనూ ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈ ఏజెంట్ల ఆగడాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఏజెంట్లకు సంబంధించి ఈ ఆదేశాలు జారీ చేసింది. 


  • ఆర్‌బీఐ కొత్త ఆదేశాలు :
  • బకాయిల వసూలు కోసం ఏజెంట్లు ఎలాంటి బెదిరింపులు, వేధింపులకు పాల్పడ కూడదు.
  • అందరి ముందు రుణగ్రస్తులను అవమానించరాదు. 
  • రుణగ్రస్తుల కుటుంబ సభ్యులు, స్నేహితులు, మధ్యవర్తుల  గోప్యతను దెబ్బతీసేలా వారి ఫోన్లు లేదా సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి మెసేజీలు, పోస్టు లు పెట్టకూడదు.
  • ఏజెంట్లు రుణగ్రస్తుల ఫోన్లకు ఉదయం ఎనిమిదింటి లోపు, సాయంత్రం ఏడింటి తర్వాత ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ చేయకూడదు.

Updated Date - 2022-08-13T05:35:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising