టీవీఎస్ గ్రూప్ నుంచి మరో ఐపీఓ...
ABN, First Publish Date - 2022-02-10T00:02:52+05:30
సుమారురూ. ఐదు వేల కోట్ల సమీకరణ లక్ష్యంతో టీవీఎస్ గ్రూప్ కంపెనీ... టీవీఎస్ సప్లై ఛైన్ సొల్యూషన్స్... ఈ వారంలోనే డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేయబోతోంది.
హైదరాబాద్ : సుమారురూ. ఐదు వేల కోట్ల సమీకరణ లక్ష్యంతో టీవీఎస్ గ్రూప్ కంపెనీ... టీవీఎస్ సప్లై ఛైన్ సొల్యూషన్స్... ఈ వారంలోనే డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేయబోతోంది. ఐపీఓలో... రూ. 20 వేల కోట్ల తాజా ఇష్యూలు, రూ. 3 వేల కోట్ల వరకు 'ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్)' షేర్లు అందుబాటులోకి రానున్నాయి. ఓఎఫ్‌ఎస్ ద్వారా.. ప్రమోటర్లు, ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్‌లు తమ స్టేక్‌లో కొంతభాగాన్ని విక్రయించనున్నారు. టాటా ఆపర్చునిటీస్ ఫండ్, మిత్సుబిషి కార్పొరేషన్, గేట్‌వే పార్ట్‌నర్స్, ఎక్సోర్ ఈ కంపెనీలోని కొన్ని పెట్టుబడి సంస్థలు. చెన్నై కేంద్రంగా పని చేస్తోన్న టీవీఎస్ సప్లై ఛెయిన్ సొల్యూషన్స్... ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్‌లోకి ప్రవేశించిన మూడో లాజిస్టిక్స్ సెక్టార్ కంపెనీగా మారనుంది.
Updated Date - 2022-02-10T00:02:52+05:30 IST