ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌కు స్థితి నేపథ్యంలో... వైద్య కళాశాల ఏర్పాటు దిశగా ఆనంద్ మహీంద్రా

ABN, First Publish Date - 2022-03-03T22:58:56+05:30

ఉక్రెయిన్‌లో ఇండియన్ స్టూడెంట్స్ వెతల నేపథ్యంలో... తీవ్రంగా చలించిపోయిన ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర... సంచలన నిర్ణయం తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

* సంచలన నిర్ణయం కానుందంటూ నెటిజన్ల వ్యాఖ్యలు

* హైదరాబాద్‌లోనే ఏర్పాటు కానుందంటూ ఊహాగానాలు

* భారత విద్యార్ధులకు అండగా నిలవాలనే...

ముంబై : ఉక్రెయిన్‌లో ఇండియన్ స్టూడెంట్స్ వెతల నేపథ్యంలో... తీవ్రంగా చలించిపోయిన ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర... సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహీంద్రా గ్రూపు ఆధ్వర్యంలో మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి ఆయన సిద్ధమయ్యారు. భారతీయులు ఎక్కువగా మెడిసన్ కోసం ఉక్రెయిన్ కు వెళ్తుంటారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం... యుద్ధం జరుగుతోన్న నేపథ్యంలో... అక్కడ చిక్కుకున్న మన దేశ విద్యార్థులను భారత్‌కు తరలిస్తున్నారు. 


ఈ నేపథ్యంలో మహీంద్రా గ్రూపు ఆధ్వర్యంలో ఓ వైద్య కళాశాలను నిర్మించాలని మహేంద్ర నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలంటూ మహీంద్రా యూనివర్సిటీ బాధ్యులకు సూచనలు చేశారు. ఈ వివరాలను ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. భారత్‌లో... వైద్య కళాశాలలు లేవా.. ? వైద్య విద్య కోసం ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్ధులు భారత్ నుండి నిత్యం వేదేశాలకు వెళ్ళాలా ? అంటూ తనకుతానే ప్రశ్నించుకున్న మహీంద్రా... ఈ పరిస్థితిపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని ఉద్దేశించుకున్నారు. ఈ క్రమంలోనే... మహీంద్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో వైద్యకళాశాలను ఏర్పాటు చేసేందుకు అవకాశముందా ? అని టెక్‌ మహీంద్రా ఛీఫ్‌ సీపీ గుర్నానిని ప్రశ్నించారు . 


కాగా... ఈ క్రమంలో... ఆనంద్ మహేంద్ర చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు... ఆనంద్ మహీంద్రా ఒకవేళ  వైద్యకళాశాలను ఏర్పాటు చేస్తే.. ఎక్కడ చేస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా... మహీంద్రా యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఉన్నందున... వైద్య కళాశాలను కూడా హైదరాబాద్ లోనే ఏర్పటు చేసే అవకాశాలున్నాయని ఆయా వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2022-03-03T22:58:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising