ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anand Mahindra : రాకేష్ ఝున్‌ఝున్‌ వాలా చెప్పిన అత్యంత విలువైన పెట్టుబడి సలహా ఇదీ.. డబ్బు అవసరం లేదు..

ABN, First Publish Date - 2022-08-22T00:25:17+05:30

ఆదర్శం, ప్రేరణ, జ్ఞానం, సమాచారం - ఈ నాలుగింటి కలయికే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహింద్రా(Anand Mahindra) ట్వీట్లు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ఆదర్శం, ప్రేరణ, జ్ఞానం, సమాచారం - ఈ నాలుగింటి కలయికే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహింద్రా(Anand Mahindra) ట్వీట్లు. ఎప్పటిలాగానే తన 9.5 మిలియన్ల ఫాలోయర్ల కోసం ఆదివారం మరో సందేశాత్మక ట్వీట్(Tweet) షేర్ చేశారాయన. ఇటివలే హఠాన్మరణం చెందిన దిగ్గజ ఇన్వెస్టర్ రాకెష్ ఝున్‌ఝున్ వాలా(Rakesh Jhunjhunwala) గతంలో ఇచ్చిన ఓ ‘సలహా‘(advice)ను నెటిజన్లతో పంచుకున్నారు. ‘‘ ఆరోగ్యంమీద నాది అత్యంత చెత్త పెట్టుబడి. కానీ దీనిపైనే ఎక్కువగా ఇన్వెస్ట్(Invest) చేయాలని అందరినీ ప్రోత్సహిస్తాను ’’ అని 2019లో ఓ ఇంటర్వ్యూలో ఝున్‌ఝున్ వాలా చెప్పిన మాటలను ఆనంద్ మహింద్రా షేర్ చేశారు. ఆ ఇంటర్వ్యూ స్ర్కీన్ షాట్‌ను పోస్ట్ చేశారు. రాకేష్ ఝున్‌ఝున్ వాలా తన చివరి రోజుల్లో ఎప్పటికీ మిగిలిపోయే అత్యంత విలువైన, లాభదాయకమైన సలహాను ఇచ్చారని ఆనంద్ మహింద్రా రాసుకొచ్చారు. ఈ సలహా బిలియన్లు విలువ చేసేదని, ఉత్తమమైనదన్నారు. దీనికి డబ్బు అక్కర్లేదని, సమయం అవసరమని అన్నారు. ఈ పోస్టును ఎక్కువగా షేర్ చేసుకుంటున్నారని ప్రస్తావించారు. సండేథాట్స్ అని హ్యాష్‌టాగ్‌ను జత చేశారు. 


గత రాకేష్ ఝున్‌ఝున్ వాలా 2019లో ఇచ్చిన ఇంటర్వ్యూ కామెంట్‌ స్క్రీన్‌షాట్‌ను ఆనంద్ మహింద్రా షేర్ చేశారు. ఆరోగ్య సంబంధించిన విషయాలను ఝున్‌ఝున్ వాలా ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆనంద్ మహింద్రా ట్వీటర్‌లో ఈ పోస్టు పెట్టిన గంటల వ్యవధిలోనే 5 వేలకుపైగా లైక్స్ లభించాయి. చాలా మంది షేర్ కూడా చేశారు. ఎంతో విలువైన సలహా అని, ఈ విషయంలో ఎలాంటి సందేహమూలేదని నెటిజన్లు చెబుతున్నారు. బిజీబిజీ లైఫ్‌లో ఆరోగ్యం, కుటుంబంపై శ్రద్ధపెట్టడం లేదని గుర్తుచేస్తున్నారు.



Updated Date - 2022-08-22T00:25:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising