ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాంద్యంలోకి అమెరికా!

ABN, First Publish Date - 2022-07-29T08:46:19+05:30

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ ఆర్థిక మాంద్యం కోరలు చాస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైనస్‌ 0.9 శాతానికి వృద్ధి క్షీణత 

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ ఆర్థిక మాంద్యం కోరలు చాస్తోంది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలోనూ అమెరికా జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 0.9 శాతానికి పడిపోయింది. మార్చి త్రైమాసికంలోనూ అమెరికా జీడీపీ మైనస్‌ 1.6 శాతంగా నమోదైంది. జీడీపీ వృద్ధి రేటు వరుసగా రెండు త్రైమాసికాలు మైనస్‌ స్థాయిలో నమోదైతే సాంకేతికంగా దాన్ని ‘ఆర్థిక మాంద్యం’గా పరిగణిస్తారు. తాజా గణాంకాల ప్రకారం చూస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ సాంకేతికంగా ఆర్థిక మాంద్యంలోకి వెళ్లినట్టు  లెక్క. చమురు సెగతో రిటైల్‌ ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరడం, దాన్ని కట్టడి చేసేందుకు అమెరికా కేంద్ర బ్యాంక్‌ దూకుడుగా వడ్డీ రేట్లు పెంచడం ఇందుకు ప్రధాన కారణం.


ఇంకా మాంద్యం రాలేదు: ఫెడ్‌  

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ మాత్రం.. అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్లిందన్న వార్తలను తోసిపుచ్చింది. ఇంకా ఆ స్థాయికి రాలేదని ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పొవెల్‌ చెప్పారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరినా జాబ్‌ మార్కెట్‌  ఇంకా బాగానే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. నిరుద్యోగ రేటు 3.6 శాతానికి దిగొచ్చింది. సరైన నిపుణులు దొరక్క దాదాపు 1.1 కోట్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కాగా బుధవారం మరో ముప్పావు (0.75 శాతం) వడ్డీ రేట్లు పెంచిన ఫెడ్‌ రిజర్వ్‌ ముందు ముందు ఆ స్థాయిలో వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చని ప్రకటించింది.

Updated Date - 2022-07-29T08:46:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising