ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ambani Vs Adani : వ్యూహం మార్చిన అంబానీ.. అదానీని దెబ్బకొట్టేందుకేనా?

ABN, First Publish Date - 2022-08-01T18:11:51+05:30

ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక విదేశీ టెలికమ్యూనికేషన్స్ దిగ్గజాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచనలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Ambani Vs Adani : ముఖేష్ అంబానీ(Mukhesh Ambani)కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(Reliance Industries Ltd) ఒక విదేశీ టెలికమ్యూనికేషన్స్ దిగ్గజాన్ని(foreign telecommunications giant) కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం అంబానీ(Ambani)ని అధిగమించి మరీ గౌతమ్ అదానీ అత్యంత ధనవంతుడిగా అవతరించారు. కాగా.. 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు అదానీ డేటా నెట్‌వర్క్స్(Adani Data Networks)సైతం రంగంలోకి దిగడంతో అంబానీ టీం అలెర్ట్ అయ్యి పై చెయ్యి సాధించింది. ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో టాప్‌ బిడ్డర్‌గా నిలిచింది. పలు బ్యాండ్లకు చెందిన 24,740 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ను రూ.88,078 కోట్లకు దక్కించుకుంది. వేలంలో అమ్ముడైన మొత్తం స్పెక్ట్రమ్‌లో దాదాపు సగం అంబానీయే కొనుగోలు చేయటం విశేషం.


గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ డేటా నెట్‌వర్క్స్‌.. 26 గిగాహెట్జ్‌ బ్యాండ్‌విడ్త్‌కు చెందిన 400 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ను రూ.212 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలో అమ్ముడుపోయిన మొత్తం స్పెక్ట్రమ్‌లో అదానీ దక్కించుకుంది ఒక శాతం కన్నా తక్కువే. అదానీ గ్రూప్‌‌నకు కనీసం వైర్‌లెస్ టెలికమ్యూనికేషన్ సేవలను అందించే లైసెన్స్ కూడా లేదు. కానీ ఆయన ఎలాగైనా అంబానీ ఆశలకు గండికొట్టాలని బలంగా ప్రయత్నించినప్పటికి ఫలితం లేకపోయింది.

Updated Date - 2022-08-01T18:11:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising