డిస్కౌంట్‌పై స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా?..
ABN, First Publish Date - 2022-10-27T18:06:25+05:30
పండుగలు ముగిసిపోవడంతో ఈ-కామర్స్ సంస్థల (E-Commerce) ఫెస్టివ్ సేల్స్ పూర్తయ్యాయి. మరి డిస్కౌంట్‌పై కొత్త సెల్‌ఫోన్ కొనాలనుకునేవారికి అవకాశం లేదా?.. అని ఎవరూ భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే..
పండుగలు ముగిసిపోవడంతో ఈ-కామర్స్ సంస్థల (E-Commerce) ఫెస్టివ్ సేల్స్ పూర్తయ్యాయి. మరి డిస్కౌంట్‌పై కొత్త సెల్‌ఫోన్ కొనాలనుకునేవారికి అవకాశం లేదా?.. అని ఎవరూ భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ‘స్మార్ట్ అప్‌గ్రేడ్ డేస్’ (Smartphone Upgrade Days) సేల్ రేపటితో (శుక్రవారం) ముగియనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై ఎక్స్చేంజీ డీల్స్, బ్యాంక్ ఆఫర్స్, డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ వంటి స్కీమ్స్‌తోపాటు పలు ఇతర ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 25న ప్రారంభమైన ఈ సేల్ అక్టోబర్ 28న ముగియనుంది. వన్‌ప్లస్, షియోమీ, సామ్‌సంగ్, రియల్‌మీ, ఐకూ (iQOO) వంటి స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాకుండా ఏయూ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ పొందొచ్చు. 6 నెలలు ఫ్రీ స్క్రీన్ రిప్లేస్‌మెంట్ సౌకర్యం కూడా ఉంది.
ఈ సేల్‌లో షియోమీ, రియల్‌మీ, సామ్‌సంగ్, టెక్నో కంపెనీల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్‌కు సంబంధించిన ఫోన్లలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ2(OnePlus Nord CE 2) రూ.23,499, వన్‌ప్లస్ 10ఆర్ ప్రైమ్ (and OnePlus 10R Prime) రూ.29,499 రేట్లలో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఐకూ కంపెనీకి చెందిన ఫోన్లలో ఐకూ జెడ్6 5జీ (iQOO Z6 5G), ఐకూ జెడ్6 లైట్ 5జీ (iQOO Z6 Lite 5G) ఉన్నాయి. ఇక షియోమీకి సంబంధించిన ఫోన్లలో రెడ్‌మీ నోట్ 11టీ 5జీ (Redmi Note 11T 5G), రెడ్‌మీ 10ఏ, రెడ్2మీ నోట్ 11ప్రో ప్లస్ వంటి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిపై డిస్కౌంట్లు కూడా లభిస్తున్నాయి. రియల్‌మీ ఫోన్ల విషయానికి వస్తే.. రియల్‌మీ నర్జో 50 4జీ, రియల్‌మీ నర్జబ 50ఐ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. సామ్‌సంగ్ కంపెనీకి సంబంధించిన ఫోన్లలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎం13 5జీ డిస్కౌంట్‌పై లభిస్తోంది. టెక్నో కంపెనీకి చెందిన టెక్నో పాప్ 6 ప్రో ఫోన్ చక్కటి ఫీచర్లతో డిస్కౌంట్ రేటులో లభిస్తోంది.
Updated Date - 2022-10-27T18:11:05+05:30 IST