ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amazon Great Indian Festival sale: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రకటన.. ఎస్‌బీఐ కార్డు యూజర్లకు గుడ్‌న్యూస్..

ABN, First Publish Date - 2022-09-05T23:18:33+05:30

ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్(Amazon Great Indian Festival sale) రానేవచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్(Amazon Great Indian Festival sale) రానేవచ్చింది. త్వరలోనే సేల్ ఆరంభమవనుందని అమెజాన్ ప్రకటించింది. సేల్స్ తేదీని వెల్లడించకపోయినప్పటికీ ‘అమెజాన్‌లో కొన్నామని ఇండియా చెబుతుంది’ అంటూ ఓ ట్యాగ్‌లైన్ జత చేసింది. కాగా ఈ నెల చివరిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సమయంలో గ్రేట్ ఇండియన్ పెస్టివల్ సేల్ జరిగే అవకాశాలున్నాయి. అనేక ప్రొడక్టులపై కార్డ్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, పలు కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణతోపాటు మరెన్నో ఆకర్షణీయ ఆఫర్లు ఉండబోతున్నాయని అమెజాన్ సంకేతాలిచ్చింది. ఈ మేరకు సోమవారం ఒక పోస్టర్‌ను విడుదల చేసింది.


ఎస్‌బీఐ కార్డ్ వినియోగదారులకు బంపరాఫర్..

కాగా ఎప్పటిలాగానే ఈసారి కూడా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లు(Amazon prime subscribers).. సాధారణ యూజర్ల కంటే ముందే డీల్స్ పొందొచ్చు. సేల్‌లో పలు కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణలు ప్రైమ్ సబ్‌స్ర్కైబర్లకే అందుబాటులోకి రానున్నాయి. ఇక బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. ఎస్‌బీఐతో(SBI) అమెజాన్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. కాబట్టి ఈ సేల్‌లో ఏవైనా ప్రొడక్టులు కొనాలనుకునే ఎస్‌బీఐ వినియోగదారులు ఈ కార్డులను సిద్ధం చేసుకోవచ్చు. మరోవైపు వినియోగదారులు అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా పొందొచ్చని అమెజాన్ ప్రకటించింది.

Updated Date - 2022-09-05T23:18:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising