ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jio AIR FIBER: జియో నుంచి సరికొత్త పరికరం.. యూజర్లూ మీకు వైర్ల అవసరం ఉండదిక..

ABN, First Publish Date - 2022-08-29T23:04:29+05:30

ఎప్పటికప్పుడు అధునాతన సేవలు, పరికరాలను వినియోగదారులకు చేరువ చేయడంలో ముందుండే రిలయన్స్ జియో(Reliance Jio) మరో సరికొత్త ఆవిష్కరణకు ముందుకొచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఎప్పటికప్పుడు అధునాతన సేవలు, పరికరాలను వినియోగదారులకు చేరువ చేయడంలో ముందుండే రిలయన్స్ జియో(Reliance Jio) మరో సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది. సరికొత్త జియో ఎయిర్ ఫైబర్ (Jio AIR FIBER) పరికరాన్ని ఆవిష్కరించినట్టు రిలయన్స్ జియో(Reliance jiO) చైర్మన్ ఆకాశ్ అంబానీ(Akash Ambani) ప్రకటించారు. జియో ఎయిర్ ఫైబర్ (Jio AIR FIBER) అనేది ఒక ప్లగ్-అండ్-ప్లే (plug-and-play) పరికరం. ఎలాంటి వైర్లు(Wires) లేకుండానే ఎయిర్ ద్వారా ఫైబర్ నెట్‌వర్క్ స్పీడ్‌కు సమానస్థాయి అనుభూతిని కస్టమర్లు పొందొచ్చని  ఆకాశ్ అంబానీ వివరించారు. అల్ట్రా-హై-స్పీడ్ జియో ట్రూ 5జీ ఇంటర్నెట్‌తో అనుసంధానమై ఉండే ఈ పరికరం ఇళ్లు లేదా ఆఫీసుల వద్ద పర్సనల్ హాట్‌స్పాట్‌గా పనిచేస్తుందని వెల్లడించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries Limited) 45వ ఏజీఎం(Annual General Meeting) సందర్భంగా ఆకాశ్ అంబానీ ఈ ప్రకటన చేశారు. 


బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ పెంపుదల లక్ష్యంలో జియో ట్రూ 5జీ ఒక చక్కటి విజయమని ఆకాశ్ అంబానీ అభివర్ణించారు. నెట్‌వర్క్‌లో జాప్యం కనిష్ఠస్థాయికి తగ్గిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోని అనేక ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లపై 1జీబీపీఎస్ స్పీడ్ కూడా పొందడంలేదని ఈ సందర్భంగా ఆకాశ్ అంబానీ ప్రస్తావించారు. జియో ఎయిర్‌ఫైబర్ స్పీడ్ గిగాబైట్‌గా ఉంటుందని వివరించారు. ఈ పరికరం ద్వారా మల్టీపుల్ వీడియో స్ట్రీమ్స్‌తోపాటు ఇతర సర్వీసులు పొందొచ్చని చెప్పారు.


ఈ దీపావళికే జియో 5జీ..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 45వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా భారతీయ సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) అధినేత ముకేష్ అంబానీ (Mukesh Ambani) కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది దీపావళి(Diwali) నాటికి దేశంలోని ముఖ్యనగరాల్లో జియో 5జీ (JIO 5G) నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. డిసెంబర్ 2023 నాటికి దేశంలోని ప్రతి పట్టణానికి 5జీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్(pan-India) విస్తరణకుగానూ రూ.2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించినట్టు ప్రకటించారు. డిజిటల్ కనెక్టివిటీ నెట్‌వర్క్ రూపకల్పనకు రిలయన్స్ జియో (Reliance JIO) మరో ముందడుగు వేస్తోందని, అదే ’జియో 5జీ’ (JIO 5G) అని అంబానీ వ్యాఖ్యానించారు. వినియోగదారులకు అసమాన అనుభూతి, స్మార్ట్ హోం సొల్యూషన్స్‌తో దేశంలోని 10 కోట్ల ఇళ్లకు 5జీ నెట్‌వర్క్ ద్వారా అనుసంధానమవ్వబోతున్నామని అభిలాషించారు.

Updated Date - 2022-08-29T23:04:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising