ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Akasa Air గుడ్‌న్యూస్.. అక్టోబర్ 15 నుంచి ప్రయాణికులు..

ABN, First Publish Date - 2022-10-07T00:26:18+05:30

అకాసా ఎయిర్(Akasa Air) ప్రయాణికులకు ముఖ్యంగా పెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులు తమకు ఇష్టమైన పెంపుడు జంతువులతోపాటు విమానంలో ప్రయాణించేందుకు మార్గం సుగమం చేసినట్టు వెల్లడించింది. ప్రయాణికులు తమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: అకాసా ఎయిర్(Akasa Air) ప్రయాణికులకు ముఖ్యంగా పెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులు తమకు ఇష్టమైన పెంపుడు జంతువులతోపాటు విమానంలో ప్రయాణించేందుకు మార్గం సుగమం చేసినట్టు వెల్లడించింది. ప్రయాణికులు తమ పెంపుడు జంతువులతోపాటు విమానంలో ప్రయాణించేందుకు వీలుగా ప్రత్యేక క్యాబిన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. అక్టోబర్ 15 నుంచి ఈ ప్రత్యేక క్యాబిన్ అందుబాటులోకి వస్తుందని చెప్పింది. 


అక్టోబర్15 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చని ప్రయాణికులకు సూచించింది. అంతేకాకుండా ప్రయాణికులకు అకాసా ఎయిర్ ఒక షరతు కూడా విధించింది. పెంపుడు జంతువుల బరువు ఏడు కిలోలు లేదా అంత కంటే తక్కువగా ఉండాలని తేల్చి చెప్పింది. అంతకంటే ఎక్కువ బరువున్న పెంపుడు జంతువులతో ప్రయాణించడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్, విస్తారా, స్పైస్‌జెట్ వంటి విమానయాన సంస్థలు.. ఇప్పటికే ఈ సర్వీసులను అందిస్తున్నాయి. ఇండిగో, ఎయిర్ ఏసియా మాత్రం ఈ సర్వీసులకు ఆఫర్ చేయడం లేదు. 


Updated Date - 2022-10-07T00:26:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising