ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Akasa Air : రాకేష్ ఝున్‌ఝున్ వాలా సంస్థ ‘ఆకాశ ఎయిర్’ నుంచి కీలక ప్రకటన

ABN, First Publish Date - 2022-08-20T03:07:10+05:30

ఇటివలే హఠాన్మరణం చెందిన దిగ్గజ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్ వాలా(Rakesh Jhunjhunwala)కు చెందిన విమానయాన సంస్థ ‘ఆకాశ ఎయిర్‌’ (Akasa Air) కీలక ప్రకటన చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఇటివలే హఠాన్మరణం చెందిన దిగ్గజ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్ వాలా(Rakesh Jhunjhunwala)కు చెందిన విమానయాన సంస్థ ‘ఆకాశ ఎయిర్‌’ (Akasa Air) కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ చివరి నాటికల్లా 150కిపైగా వీక్లీ ఫ్లైట్లను నిర్వహించనున్నట్టు తెలిపింది. ఆగస్టు 7న ముంబై - అహ్మదాబాద్ మధ్య తొలి ఫ్లైట్‌తో ఆకాశ ఎయిర్ సర్వీసులు ఆరంభమైన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం  ముంబై - అహ్మదాబాద్, బెంగళూరు-కొచ్చి, బెంగళూరు-ముంబై మధ్య మాత్రమే సర్వీసులు నడుస్తున్నాయి. ముంబై-అహ్మదాబాద్ రూట్‌లో ప్రస్తుతం 2 సర్వీసులే నిర్వహిస్తుండగా ఆగస్టు 30 నుంచి ఒకటి, సెప్టెంబర్ 19, 2022 నుంచి మరొకటి చొప్పున అదనపు సర్వీసులు మొదలవుతాయని ప్రకటనలో వివరించింది. సెప్టెంబర్ 10 నుంచి బెంగళూరు - చెన్నై సర్వీసును కూడా ప్రారంభించనున్నట్టు తెలిపింది.


కాగా ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులతో ఏర్పడిన ‘ఆకాశ ఎయిర్‌’ ఆగస్టు 7 నుంచి విమాన సర్వీసులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ముంబై-అహ్మదాబాద్‌’ మధ్య తొలి ఆకాశ ఎయిర్‌ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా వర్చువల్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే. కేవలం 12 నెలల్లో తమ విమానయాన సంస్థకు అన్ని అనుమతులు ఇచ్చినందుకు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా.. సింథియాకు కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-08-20T03:07:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising