హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ 5జీ
ABN, First Publish Date - 2022-12-16T00:45:31+05:30
భారతీ ఎయిర్‌టెల్ హైదరాబాద్‌లో 5జీ సేవలను ప్రారంభించింది. ముందుగా ముఖ్యమైన ప్రదేశాలు, మెట్రో రైల్ పొడవున...
ముందుగా మెట్రో రైల్, రైల్వే స్టేషన్లు, ఇతర ప్రాంతాల్లో
ఇప్పుడున్న డేటా ప్లాన్‌పైనే 5జీ సేవలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): భారతీ ఎయిర్‌టెల్ హైదరాబాద్‌లో 5జీ సేవలను ప్రారంభించింది. ముందుగా ముఖ్యమైన ప్రదేశాలు, మెట్రో రైల్ పొడవున, రైల్వే స్టేషన్లు, హైదరాబాద్ బస్ స్టాండ్ తదితర ట్రాన్స్‌పోర్ట్ కేంద్రాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉంటాయి. దశల వారీగా హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు కూడా 5జీ సేవలను ఎయిర్‌టెల్ విస్తరిస్తుంది. ఇక హైదరాబాదీలు అల్ర్టా-ఫాస్ట్ 5జీ కనెక్టివిటీ ‘ఎయిర్‌టెల్ 5జీ ప్లస్’ను ఆస్వాదించవచ్చని భారతీ ఎయిర్‌టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఈఓ శివన్ భార్గవ తెలిపారు.
ఎక్కడెక్కడ అందుబాటులోకి..: హైదరాబాద్ మెట్రో రైల్, సికింద్రాబాద్, కాచీగూడ రైల్వే స్టేషన్లు, ఇమ్లిబన్ బస్ డిపోతో పాటు బేగంపేట్, బంజారా హిల్స్, జుబ్లీ హిల్స్, హై-టెక్ సిటీ, గచ్చిబౌలి, బోయినపల్లి, కొంపల్లి, ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్, కోఠి, మలక్‌పేట్, చార్మినార్, హబ్సిగూడ, ఉప్పల్, నాగోల్, కూకట్‌పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. దశల వారీగా 5జీ సేవలను ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు.
సిమ్ మార్చాల్సిన అవసరం లేదు..: అన్ని రకాల 5జీ ఫోన్లపై ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ సేవలను పొందవచ్చు. మాటలో స్పష్టత, అధిక డేటా వేగాన్ని చందాదారులు ఆస్వాదించవచ్చని కంపెనీ పేర్కొంది. నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించే వరకూ ఇప్పుడున్న డేటా ప్లాన్‌తోనే చందాదారులు 5జీ సేవలను వినియోగించుకోవచ్చు. ఇప్పుడున్న 4జీ సిమ్ తోనే 5జీ సేవలను పొందవచ్చు. చందాదారులు ఇప్పుడు 4జీ పై పొందుతున్న స్పీడ్‌తో పోలిస్తే 20-30 రెట్ల అధిక స్పీడ్‌ను పొందవచ్చని ఎయిర్‌టెల్ పేర్కొంది. హెచ్‌డీ వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, మల్టిపుల్ చాటింగ్, ఫోటోల తక్షణ అప్‌లోడింగ్ వంటి అనేక సౌకర్యాలను చందాదారులు పొందవచ్చు.
Updated Date - 2022-12-16T00:45:35+05:30 IST