ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ అంబానీకే ఆసియా కుబేర కిరీటం

ABN, First Publish Date - 2022-06-04T07:55:15+05:30

గడిచిన రెండు వారాల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 13 శాతానికి పైగా పుంజుకోవడంతో కంపెనీ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వ్యక్తిగత సంపద కూడా భారీగా పెరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండో స్థానానికి జారుకున్న అదానీ 

ముంబై: గడిచిన రెండు వారాల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 13 శాతానికి పైగా పుంజుకోవడంతో కంపెనీ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వ్యక్తిగత సంపద కూడా భారీగా పెరిగింది. దాంతో ఆయన ఆసియాలోని అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నారు. కొన్ని నెలల క్రితం అంబానీని వెనక్కి నెట్టి అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఈ స్థానాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. బ్లూంబర్గ్‌ బిలియ నీర్స్‌ రియల్‌టైం ఇండెక్స్‌ ప్రకారం.. ఈ నెల 3 నాటికి 9,970 కోట్ల డాలర్ల సంపదతో ముకేశ్‌ అంబానీ ఆసియాతో పాటు భారత నం.1 ధనవంతుడి స్థానాన్ని తిరిగి దక్కించుకున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో ఉన్నారు. కాగా, అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ 9,870 కోట్ల డాలర్ల ఆస్తితో ఆసియా, భారత శ్రీమంతుల్లో నం.2 స్థానానికి జారుకున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ 9వ స్థానానికి పరిమితం అయ్యారు. గడిచిన 24 గంటల్లో అంబానీ సంపద 359 కోట్ల డాలర్ల మేర పెరగగా.. అదానీ ఆస్తి వృద్ధి 296 కోట్ల డాలర్లుగా నమోదైందని బ్లూంబర్స్‌ వెల్లడించింది. ఫోర్బ్స్‌ రియల్‌టైం బిలియనీర్ల జాబితా ప్రకారం.. ముకేశ్‌ అంబానీ 10,360 కోట్ల డాలర్ల ఆస్తితో ప్రపంచ కుబేరుల్లో 6 స్థానానికి ఎగబాకగా.. 9,930 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో గౌతమ్‌ అదానీ 9వ స్థానంలో ఉన్నారు. 

Updated Date - 2022-06-04T07:55:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising