ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదరగొట్టిన అదానీ పవర్.. రికార్డ్ హైకి స్టాక్..

ABN, First Publish Date - 2022-08-04T16:30:43+05:30

అదానీ పవర్ షేర్లు నేడు దడదడలాడించాయి. గురువారం నాటి ఇంట్రా-డేలో బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు 3 శాతం లాభపడి అదానీ పవర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Adani Power : అదానీ పవర్ షేర్లు నేడు దడదడలాడించాయి. గురువారం నాటి ఇంట్రా-డేలో బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు 3 శాతం లాభపడి అదానీ పవర్ షేరు రికార్డు స్థాయిలో రూ. 352.30కి చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో కంపెనీ పన్ను తర్వాత ఏకీకృత లాభం (PAT) 17 రెట్లు పెరిగి రూ. 4,780 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.278 కోట్ల PATని పోస్ట్ చేసింది. 


గత ఒక నెలలో స్టాక్ దాదాపు 35 శాతం పెరిగింది. అదే సమయంలో ఎస్అండ్‌పీ బీఎస్ఈ(S&P BSE) సెన్సెక్స్‌లో 10 శాతం ర్యాలీచేసింది. గత ఆరు నెలల్లో స్టాక్ 221 శాతం జూమ్ చేసింది. అదే సమయంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లో 0.1 శాతం క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత మొత్తం ఆదాయం డబుల్ కంటే ఎక్కువగా అంటే 115 శాతం పెరిగి గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో గడించిన రూ.7,213 కోట్ల నుంచి రూ.15,509 కోట్లకు చేరుకుంది.  


2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశవ్యాప్త హీట్‌వేవ్, ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ విద్యుత్ డిమాండ్‌ను విస్తృతంగా పెంచింది. 2023 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొత్తం ఇంధన డిమాండ్ 404.8 బిలియన్ యూనిట్లు (BU)కు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇంధన డిమాండ్‌తో పోలిస్తే 18.6 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది.


Updated Date - 2022-08-04T16:30:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising