ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Adani Group : ఒడిశాలో అదానీ గ్రూప్ రూ.57 వేల కోట్ల భారీ పెట్టుబడి.. ప్రభుత్వం క్లియరెన్స్

ABN, First Publish Date - 2022-08-12T21:40:55+05:30

బిలియనీర్ గౌతమ్ అదానీ (Gautham Adani) సారధ్యంలోని అదానీ గ్రూప్(Adani Group) ఒడిశా(Odisha)లో రూ.57 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఇందుకు సంబంధించిన అదానీ గ్రూపు ప్రతిపాదనలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : బిలియనీర్ గౌతమ్ అదానీ (Gautham Adani) సారధ్యంలోని అదానీ గ్రూప్(Adani Group) ఒడిశా(Odisha)లో రూ.57 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ఇందుకు సంబంధించిన అదానీ గ్రూపు ప్రతిపాదనలకు సీఎం నవీన్ పట్నాయక్(Naveen patnaik) సారధ్యంలోని ప్రభుత్వ యంత్రాంగం ఆమోదం తెలిపింది. ఏడాదికి 4 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన ‘అల్యూమియం శుద్ధి (రిఫైనరీ) కేంద్రం ’, 30 మిలియన్ టన్నుల ముడి ఇనుము కెపాసిటీ కలిగిన ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఒడిశా ప్రభుత్వం శుక్రవారం ప్రకటన చేసింది. కాగా భారత్‌లో నిల్వవున్న ముడి ఇనుము, బాక్సైట్‌లో దాదాపు సగం ఒడిశాలోనే నిల్వ ఉన్నాయి. 


కాగా అదానీ గ్రూప్ పెడుతున్న ఈ భారీ పెట్టుబడితో ఒడిశాలో 9,300 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, పరోక్షంగా కొన్నివేల మంది ఉపాధి పొందుతారని అంచనాగా ఉంది. కాగా అదానీ గ్రూప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ జూన్ త్రైమాసికానికిగానూ రూ.41,066 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని వెల్లడించింది. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ఆదాయం 223 శాతం మేర వృద్ధి నమోదయ్యినట్టు తెలిపింది. పన్ను చెల్లింపుల తర్వాతి ఆదాయం 73 శాతం మేర పెరిగి రూ.469 కోట్లుగా ఉందని వెల్లడించింది.

Updated Date - 2022-08-12T21:40:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising