ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదానీ సెంచరీ

ABN, First Publish Date - 2022-04-03T10:24:04+05:30

అదానీ గ్రూప్‌ కంపెనీల చైర్మన్‌ గౌతమ్‌ అదానీ.. సంపాదనలో రికార్డుల మోత మోగిస్తున్నారు. బ్లూంబర్గ్‌ బిలియనీర్‌ రియల్‌ టైం ఇండెక్స్‌ ప్రకారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

100 బిలియన్‌ డాలర్లకు చేరిన అదానీ గ్రూప్‌ అధిపతి సంపద


ముకేశ్‌ అంబానీని దాటేశాడు..  


ఆసియా నం.1 కూడా ఆయనే.. 


ప్రపంచ టాప్‌ టెన్‌లోకీ ఎంట్రీ.. 


దానీ గ్రూప్‌ కంపెనీల చైర్మన్‌ గౌతమ్‌ అదానీ.. సంపాదనలో రికార్డుల మోత మోగిస్తున్నారు. బ్లూంబర్గ్‌ బిలియనీర్‌ రియల్‌ టైం ఇండెక్స్‌ ప్రకారం.. శనివారం నాటికి ఆయన వ్యక్తిగత ఆస్తి తొలిసారిగా 100 బిలియన్‌ (10,000 కోట్ల) డాలర్లకు ఎగబాకింది. మన కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.7.60 లక్షల కోట్లు. ప్రస్తుతానికి ప్రపంచంలో కేవలం 10 మంది మాత్రమే వంద బిలియన్‌ డాలర్లు లేదా అంతకుపైగా వ్యక్తిగత ఆస్తి కలిగి ఉన్నారు. అందులో అదానీ ఒకరు. అంతేకాదు, ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయనిప్పుడు ముకేశ్‌ అంబానీని వెనక్కి నెట్టి పదో స్థానానికి ఎగబాకారు.తద్వారా ఆసియాలో అత్యంత ధనవంతుడుగానూ అవతరించారు.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు అదానీ సంపద 24 బిలియన్‌ (2,400 కోట్ల) డాలర్ల మేర పెరిగింది. ప్రపంచ టాప్‌-5 కుబేర స్థానాల్లో ఉన్న టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌, మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ బిల్‌గేట్స్‌, బెర్క్‌షైర్‌ హ్యాత్‌వే చైర్మన్‌ వారెన్‌ బఫెట్‌ ఈ ఏడాదిలో పోగేసిన మొత్తం కంటే అధికమిది.ఈ సంవత్సరం సంపద వృద్ధిలో ఆయనదే ప్రపంచ అగ్రస్థానం. స్టాక్‌ మార్కెట్లో అదానీ కంపెనీల షేర్లు రేసు గుర్రాల్లా దూసుకెళ్తుండటం ఇందుకు దోహదపడింది. 

తగ్గిన అంబానీ జోరు: అదానీ రోజుకో మెట్టు ఎగబాకుతుంటే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ సంపాదనలో మాత్రం జోరు తగ్గింది. గత ఏడాది అక్టోబరులోనే 100 బిలియన్‌ డాలర్ల మైలురాయిని దాటిన అంబానీ సంపద.. రిలయన్స్‌ షేర్ల కరెక్షన్‌ ఫలితంగా గత నెలలో 82 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. ఈ మధ్య మళ్లీ పుంజుకోవడంతో ప్రస్తుతం ఆయన ఆస్తి 99 బిలియన్‌ (9,900 కోట్ల) డాలర్లుగా ఉంది. సెంచరీకి కేవలం ఒక బిలియన్‌ దూరంలో ఉన్నారు. 


Updated Date - 2022-04-03T10:24:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising